తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయ్యప్ప భక్తులకు డబుల్ గుడ్​న్యూస్- డౌట్స్​ క్లియర్​ చేసే AI యాప్- శబరిమలలో ఫుడ్ ఐటెమ్స్​ ధరలు ఫిక్స్!

అయ్యప్ప భక్తులకు గుడ్​న్యూస్- 'స్వామి' ఏఐ చాట్​బాట్​తో మీ డౌట్స్ అన్నీ క్లీయర్​- ఒక్క క్లిక్​తో యాత్ర సమాచారమంతా మీ చేతుల్లోనే!- శబరిమలలో ఫుడ్​ ఐటెమ్స్​ ధరలు ఫిక్స్!

Swami Chatbot Sabarimala Pilgrimage
Swami Chatbot Sabarimala Pilgrimage (ETV Bharat, Pathanamthitta District Administration)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Swami Chatbot Sabarimala Pilgrimage :శబరిమల దర్శన అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి కేరళలోని పతనంతిట్ట జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముతూట్​ గ్రూప్​తో కలిసి అత్యాధునిక డిజిటల్ అసిస్టెంట్ "స్వామి" ఏఐ చాట్​బాట్​ను ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులకు రియల్​ టైమ్​ సమాచారం అందించేందుకు, వారి సందేహాలకు సమాధానాలు, భద్రత అందించడమే లక్ష్యంగా ఈ చాట్​బాట్​ను అభివృద్ధి చేశారు.

అన్ని వర్గాల భక్తులు సులభంగా ఉపయోగించుకునేందుకు వీలుగా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్​ఫేస్​తో ఈ యాప్​ను సిద్ధం చేశారు. ఆలయం తెరిచే సమయం, ప్రసాదం, పూజ సమయాలు వంటి సమాచారాన్ని- భక్తులు ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చాట్​బాట్​ అందిస్తుంది. అంతేకాకుండా తమ దగ్గర్లో ఉన్న దేవాలయాలు, ఎయిర్​పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్​స్టాప్​ల వివరాలను భక్తులకు అందిస్తుంది.

'స్పెషల్ సేఫ్టీ టూల్'
మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్‌లో శబరిమలలో అయ్యప్ప భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగపడే ఓ సేఫ్టీ టూల్​ను ఈ యాప్​లో పొందుపర్చారు. దాని ద్వారా పోలీస్, అగ్నిమాపక, మెడికల్ అసిస్టెన్స్​, ఫారెస్ట్​ అధికారులు, ఫుడ్​ సేఫ్టీ అధికారులకు ఒకేసారి సమాచారం అందిచేందుకు వీలవుతుంది. ఫలితంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునే వీలుంటుంది. ఈ "స్వామి" చాట్​బాట్ ద్వారా ఆధ్యాత్మికతకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా తీర్థయాత్రల అనుభవాన్ని మెరుగపరడంచలో ఓ కీలక ముందడుగు పడినట్లైంది.

ఫుడ్​ ఐటెమ్స్​ ధరలివే!
శబరిమల తీర్థయాత్ర సీజన్​లో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ధరల జాబితాను ప్రదర్శించాలని పతనంతిట్ట కలెక్టర ఎస్​ ప్రేమకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. 2025 జనవరి 25 వరకు కచ్చితంగా ధరల లిస్ట్​ ప్రదర్శించాలని తెలిపారు. అయ్యప్ప దేవాలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలో భక్తులు తినుబండారాల ధరల విషయంలో సమస్య ఎందుర్కొంటారు. యాత్ర సమయంలో అనేక ఫిర్యాదులలు వస్తాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది అధికారులు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు.

ఐటెమ్ క్వాంటిటీ గరిష్ఠ ధర సన్నిధానం పంబా/నిలక్కల్
టీ 150ml రూ.14 రూ.12 రూ.11
కాఫీ 150ml రూ.13 రూ.12 రూ.11
డార్క్ కాఫీ/డార్క్​ టీ 150ml రూ.11 రూ.10 రూ.9
టీ/కాఫీ 150ml రూ.12 రూ.11 రూ.10
ఇన్​స్టంట్ కాఫీ(మెషీన్ కాఫీ) 150ml రూ.21 రూ.18 రూ.18
ఇన్​స్టంట్ కాఫీ(మెషీన్ కాఫీ) 200ml రూ.24 రూ.22 రూ.22
బాన్​విటా/హార్లిక్స్​ 150ml రూ.27 రూ.25 రూ.26
దాల్​ వడ 40గ్రా రూ.16 రూ.14 రూ.11
బోండా 75గ్రా రూ.15 రూ.13 రూ.10
బజ్జి 30గ్రా రూ.13 రూ.12 రూ.10
దోష(ఒకటి) చట్నీ, సాంబార్​తో 50గ్రా రూ.14 రూ.13 రూ.12
ఇడ్లీ(ఒకటి) చట్నీ, సాంబార్​తో 50గ్రా రూ.15 రూ.14 రూ.12
చపాతి(ఒకటి) 40గ్రా రూ.15 రూ.14 రూ.11
పూరి(ఒకటి) మసాలాతో కలిపి 40గ్రా రూ.16 రూ.14 రూ.12
పరోటా(ఒకటి) 50గ్రా రూ.16 రూ.14 రూ.11
పలప్పం 50గ్రా రూ.14 రూ.13 రూ.10
ఇడియప్పం 50గ్రా రూ.14 రూ.13 రూ.10

పతనంతిట్ట కలెక్టర్​ జారీ చేసిన మిగతా మార్గదర్శకాలు ఇవే

  • పతనంతిట్టా జిల్లా నలుమూలను నుంచి శబరిమలకు దారి తీసే అన్ని రహదారుల వెంబడి వంటలు చేయడం నిషేదం. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల్లో వంటలు చేయకూడదు.
  • లాహ నుంచి సన్నిధానం వరకు ఉండే రెస్టారెంట్లలో ఒకేసారి 5 సిలిండర్లు మాత్రమే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరంగా సిలిండర్లు నిల్వ​ చేయడం నిషేధం.
  • పంపా నుంచి సన్నిధానం వెళ్లే దారిలో అనుమతి లేని దుకాణాలు నిషేధం. యాత్ర దారుల్లో పశువులు మేపడం నిషిద్ధం. ఈ మార్గదర్శకాలు జనవరి 25 వరకు అమలులో ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details