Rajasthan Lift Collapse News : రాజస్థాన్‌లోని కొలిహాన్ రాగి గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. వీరిలో ఒకరు మృతి చెందగా, మిగతా 14 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారని జిల్లా కలెక్టర్ నీమ్‌కథానా శరద్ మెహ్రా తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్లకు చేతులు, కాళ్లపై స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రాణభయం లేదని వైద్యులు తెలిపారు.
ఇంతకీ ఏమైందంటే?
HCL Copper Mine Lift Collapse : హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్-HCLకు చెందిన రాగి గనిలో మంగళవారం రాత్రి సుమారు 8 గంటలకు కార్మికులు గనిలోంచి బయటకు వస్తుండగా, లిఫ్ట్ తెగిపోయింది. దీనితో 15 మంది కార్మికులు 1875 అడుగుల లోతులో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఔషధాలు, ఆహారం ప్యాకెట్లు అందించారు. గనిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కోల్కతాకు చెందిన ఎస్బీఆర్ఎఫ్ బృందం ఖేత్రీకి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది. ఈ రెస్యూ బృందాలు రెండూ కలిసి అనేక గంటలపైపాటు కష్టపడి 15 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. కార్మికులు అందరూ సురక్షితంగా బయటకు రావడం పట్ల, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, సహోద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.