Kargil Vijay Diwas 2024 : కార్గిల్ 25వ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ అమరవీరులకు నివాళులర్పించారు. లద్దాఖ్‌లోని ద్రాస్‌లో కార్గిల్ యుద్ధస్మారకం వద్ద ప్రధాని నివాళులు ఆర్పించారు. సైనికుల త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని మోదీ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.
అమరవీరులకు దేశవ్యాప్తంగా నివాళులు
కార్గిల్ 25వ విజయ్ దివస్‌ను పురష్కరించుకొని నాటి యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. కార్గిల్ అమరవీరులకు పలువురు నేతలు నివాళులు ఆర్పించారు. కార్గిల్ యుద్ధ విజయం మన బలగాల ధైర్యానికి, అసాధారణ పరాక్రమానికి ప్రతీక అని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అన్నారు. కార్గిల్ శిఖరాలపై భారతమాతను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి సైనికుడికి నివాళులు ఆర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సైనికుల త్యాగం, పరాక్రమాన్ని దేశప్రజలందరకీ స్ఫూర్తి అని రాష్ర్టపతి కొనియాడారు. దిల్లీలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవ, త్యాగం ప్రతి భారతీయుడికి, రాబోయే తరాల వారికి స్ఫూర్తి అని రాజ్‌నాథ్ అన్నారు.