తెలంగాణ

telangana

ETV Bharat / bharat

84 వెడ్స్ 66- గ్రాండ్​గా వృద్ధ జంట పెళ్లి- భార్య మరణాన్ని తట్టుకోలేక! - OLD COUPLE MARRIAGE

Old Couple Marriage In Maharashtra : భార్య చనిపోవడం వల్ల 66 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు 84 ఏళ్ల వృద్ధుడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. వృద్ధుడి రెండో పెళ్లిని అతడి కుమారులు, కుమార్తెలు ఘనంగా జరిపించారు.

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 11:50 AM IST

Updated : May 11, 2024, 12:22 PM IST

Old Couple Marriage In Maharashtra
Old Couple Marriage In Maharashtra (ETV Bharat)

84 వెడ్స్ 66- గ్రాండ్​గా వృద్ధ జంట పెళ్లి- భార్య మరణాన్ని తట్టుకోలేక! (ETV Bharat)

Old Couple Marriage In Maharashtra :84 ఏళ్ల వృద్ధుడు 66 ఏళ్ల వృద్ధురాలిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని వృద్ధుడి కుమారులు, కుమార్తెలు కలిసి ఘనంగా జరిపించారు. తండ్రి పెళ్లి బరాత్​లో వారందరూ డ్యాన్స్​తో అదరగొట్టారు. ఈ సంఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలో జరిగింది.

అంజన్‌ గావ్‌ సర్జి తాలూకాలోని చించోలి రహీమాపుర్‌కు చెందిన విఠల్‌ ఖండారే(84) భార్య మూడేళ్ల క్రితం మరణించింది. విఠల్ ఖండారేకు నలుగురు కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయితే విఠల్ తన భార్య లేకపోవడం వల్ల ఒంటిరితనంతో బాధపడ్డారు. పెళ్లి చేసుకుంటానని తన పిల్లలకు చెప్పారు. మొదట్లో విఠల్ పెళ్లి నిర్ణయంపై వారు తిరస్కరించారు. అయినా విఠల్ పెళ్లికి పట్టుపట్టడం వల్ల పెళ్లికి ఆంగీకరించారు. ఆ తర్వాత పెళ్లి కుమార్తెను వెతకడం ప్రారంభించారు.

విఠల్ ఖండారే వయసు 84 కావడం వల్ల ఆయనకు పెళ్లి కుమార్తె దొరకడం కష్టమైంది. అయినప్పటికీ విఠల్ కుమారులు తీవ్రంగా తండ్రి కోసం పెళ్లి కూతుర్ని వెతికారు. ఇటీవల అకోలా జిల్లాలోని అకోట్‌కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలితో విఠల్ వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో మే 8న చించోలి రహీమాపుర్ గ్రామంలో విఠల్ ఖండారే వివాహ వేడుక ఘనంగా జరిగింది. విఠల్​ను పెళ్లి కుమారుడిని చేసి అతడి కుమారులు ఊరేగింపుగా పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. ఈ ఆనందంలో విఠల్ కుమారులు, మనవరాళ్లు, మనవళ్లు ఊరేగింపులో డ్యాన్స్ వేశారు.

వృద్ధురాలిని పెళ్లాడిన వృద్ధుడు
అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటకలో కొన్నాళ్ల క్రితం జరిగింది. మైసూరు జిల్లాకు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు 65 ఏళ్ల వృద్ధురాలిని వివాహమాడారు. గౌసియా నగరకు చెందిన ముస్తఫా భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. ఆయనకు తొమ్మిది మంది పిల్లలు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. వారి నచ్చిన పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. దీంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగానే ఉన్న ముస్తఫా మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తోడు కోసం వెతకగా అదే నగరంలో ఉన్న ఫాతిమా అనే మహిళ గురించి తెలిసింది. ఆమెకు భర్త లేరు. పిల్లలు ఉన్నా వివాహాల తర్వాత వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఫాతిమా కూడా ఒంటరిగానే ఉంది. ఇదంతా తెలుసుకున్న ముస్తఫా ఫాతిమాను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించారు. ఆమె అందుకు అంగీకరించింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యుల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు.

గుడికి వెళ్లొస్తుండగా ఘోరప్రమాదం- ఒకే ఫ్యామిలీలోని ఆరుగురు స్పాట్​డెడ్​ - CAR ACCIDENT

సైబర్​ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం- 28200 మొబైళ్లు బ్లాక్​- 20లక్షల నంబర్లు కట్! - DOT BLOCKS MOBILE HANDSETS

Last Updated : May 11, 2024, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details