కేజ్రీవాల్ సోమవారం ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) సభ్యులతో 'వన్ ఆన్ వన్' మీటింగ్ నిర్వహించారు క్రేజీవాల్. ఈ విషయాన్ని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈ సమావేశంలో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఒక్కో నేతతో కేజ్రీవాల్ విడిగా మాట్లాడి అభిప్రాయం తీసుకున్నట్లు సౌరభ్ పేర్కొన్నారు. "ఈ మీటింగ్‌లో క్రేజీవాల్ తన స్థానంలో ఎవరిని సీఎంను ఎంపిక చేయాలనే విషయమై ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి పర్సనల్ ఫీడ్‌బ్యాక్ కోరారు. రేపు లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఇదే విషయమై మరోసారి(రెండో దఫ) చర్చిస్తారు." అని భరద్వాజ్ వెల్లడించారు.
దిల్లీ నెక్స్ట్ సీఎం కోసం ఆప్ హంట్ స్టార్ట్- PAC సభ్యుల పర్సనల్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్న కేజ్రీవాల్ - Delhi News Live Updates - DELHI NEWS LIVE UPDATES
![దిల్లీ నెక్స్ట్ సీఎం కోసం ఆప్ హంట్ స్టార్ట్- PAC సభ్యుల పర్సనల్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్న కేజ్రీవాల్ - Delhi News Live Updates Delhi News Live Updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-09-2024/1200-675-22464782-532-22464782-1726479548294.jpg)
Published : Sep 16, 2024, 3:55 PM IST
|Updated : Sep 17, 2024, 9:03 AM IST
Delhi News Live Updates : దిల్లీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా పలు సమావేశాలను నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం జరగననున్న ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికంటే ముందు అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో దిల్లీ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
LIVE FEED
PAC సభ్యుల ఫీడ్‌బ్యాక్ తీసుకున్న కేజ్రీవాల్
ఆప్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్
దిల్లీ కొత్త సీఎం ఎంపికపై చర్చించేందుకు ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం మంగళవారం జరగనుంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈ సమావేశం జరగనుందని ఆప్ వర్గాలు తెలిపాయి.
కేజ్రీవాల్ రాజీనామాకు ముహూర్తం ఖరారు!
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాకు ముహూర్తం ఖరారు అయింది!. ఈ మేరకు కేజ్రీవాల్ దిల్లీ ఎల్జీ వీకే సక్సేనాను కలిసేందుకు మంగళవారం అపాయింట్మెంట్ తీసుకున్నారని ఆప్ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. అప్పుడే కేజ్రీవాల్ రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు ఆప్ నేతలు ఇంతకుముందు చెప్పారు. మరోవైపు, దిల్లీ తర్వాతి సీఎం ఎంపిక విషయంలో కేజ్రీవాల్‌తో చర్చించేందుకు మనీశ్ సిసోదియా భేటీ అయ్యారు.
సీఎం పీఠం ఎవరికి దక్కేనో?
రెండు రోజుల్లో రాజీనామా చేస్తానన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేజ్రీవాల్ తర్వాత దిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్య సునీత, దిల్లీ మంత్రులు అతిషీ, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లోత్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ రాఖి బిర్లా వంటి కొందరు రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా సీఎం రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ప్రజలతో మంచివారు అనిపించుకున్న తర్వాతే తాను, మనీశ్ సిసోదియా సీఎం, డిప్యూటీ సీఎంలు ఛార్జ్ తీసుకుంటామని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిసోదియా సీఎం రేసులో లేనట్లు తేలిపోయింది.