తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి - MAOISTS KILLED IN ENCOUNTER

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి

Maoists Killed In Encounter In Chhattisgarh
Maoists Killed In Encounter In Chhattisgarh (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2024, 12:57 PM IST

Updated : Dec 12, 2024, 3:44 PM IST

Maoists Killed In Encounter In Chhattisgarh :ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. అబూజ్​మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బస్తర్ రేంజ్​లో ఉన్న నాలుగు జిల్లాల(నారాయణపూర్, దంతెవాడ, జగదల్‌పుర్, కొండగావ్) బలగాలు భారీ కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు ఎదురుపడ్డారు. అనంతరం పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. కూంబింగ్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.

సెర్చ్​ ఆపరేషన్​లో భాగంగా ఇప్పటివరకు యూనిఫాంలు ధరించిన ఏడుగురు గుర్తుతెలియని నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ పీ సుందర్​రాజ్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది.

ఈ ఎన్​కౌంటర్​పై ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్పందించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్​లో ఏడుగురుని మావోయిస్టులను మట్టుబెట్టడంలో భద్రతా దళాలు విజయం సాధించాయన్నారు. "ముందస్తు సమచారంతో ఈ రోజు ఈ చర్యలు తీసుకున్నాము. గత ఐదేళ్లలో 219 మంది నక్సలైట్లు చనిపోయారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు 220మంది నక్సలైట్లు మృతిచెందారు." అని ఛత్తీస్​గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు.

అమిత్​ షా పర్యటనకు ముందు భారీ ఎన్​కౌంటర్
కేంద్ర హోం మంత్రి అమిత్​ షా డిసెంబర్ 15న బస్తర్​లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు దళం యాక్టివ్ అయ్యిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై పోలీసులు, బస్తర్ రేంజ్​లోని నాలుగు జిల్లాల నుంచి దాదాపు వేయి మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. మావోయిస్టుల ఆచూకీ కోసం భారీ ఆపరేషన్ చేపట్టారు.

ఇటీవల జరిగిన ప్రధాన నక్సలైట్ ఎన్​కౌంటర్లు

2024 అక్టోబర్ 4 :ఛత్తీస్​గఢ్​లోని అబూజ్​మడ్​ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్​కౌంటర్​లో 38మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకేసారి ఇంత ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు ఎన్​కౌంటర్​లో చనిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి.

2024 జూలై 17 :మాహాష్ట్రలోని గడ్చిరోలిలో దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఎన్​కౌంటర్​లో 12మంది మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు అనేక అటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

2024 మే 10 :ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్ జిల్లా పిడియా సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో 12మంది నక్సలైట్లు మరణించారు.

2024 ఏప్రిల్ 16 :ఛత్తీస్​గఢ్ బస్తర్​ రేంజ్​ కంకేర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో దాదాపు 29మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Last Updated : Dec 12, 2024, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details