Madurai Kundu Bhai Style Biryani Recipe :నాన్ వెజ్ రెసిపీస్ టాపిక్లోహైదరాబాద్ అనగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది.. 'హెదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ'. ఒక్కసారి ఈ బిర్యానీ రుచి చూశారంటే అంతే.. మసాలా నషాళానికి అంటాల్సిందే. టేస్ట్.. అంత బాగుంటుంది మరి. అయితే.. ఈ రుచి మనం ప్రతిసారీ ఆస్వాదిస్తుంటాం. అందుకే.. ఈ సండే ఓ కొత్త బిర్యానీ టేస్ట్ చేద్దాం. అదే.. "మధురై కుందు భాయ్" స్టైల్ బిర్యానీ. మరి.. ఈ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మధురై కుందు భాయ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు :
- చికెన్ - కిలో
- బాస్మతి రైస్- కిలో
- వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కప్పు
- పచ్చిమిరపకాయలు- 8
- లవంగాలు-8
- దాల్చిన చెక్క-4
- యాలకులు-7
- జాపత్రి
- జాజికాయ
- మరాఠి మొగ్గ
- బిర్యానీ ఆకు
- షాజీరా
- నిమ్మరసం,
- అల్లంవెల్లుల్లి ముద్ద
- జీలకర్ర,
- ధనియాల పొడి,
- ఉప్పు- తగినంత,
- పెరుగు- రెండు కప్పులు,
- నూనె- తగినంత,
- కొత్తిమీర, పుదీనా- కప్పు చొప్పున,
- పాలు- కొన్ని
- కుంకుమపువ్వు,
- ఫుడ్ కలర్ (కావాలనుకుంటే)
బిర్యానీ కోసం చికెన్ మారినేషన్ విధానం :
- ముందుగా చికెన్ ముక్కలను రెండు మూడు సార్లు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి.
- తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
- ఇప్పుడు నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, లవంగాలు-2, దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ, మరాఠి మొగ్గ, షాజీరా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.
- ఆ తర్వాత పెరుగు వేసి మిశ్రమాన్ని బాగా కలిపాలి.
- ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కాస్తంత నూనె వేసి మరోసారి కలియబెట్టాలి. ఆ తర్వాత దాన్ని ఓ గంట పాటు పక్కన పెట్టాలి.
- వేరొక గిన్నెలో బాస్మతి బియ్యాన్ని ఇరవై నిమిషాలు నానబెట్టాలి.