తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు'- ఈటీవీ భారత్​తో అమిత్ షా ఎక్స్​క్లూజివ్​ - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

Amit Shah On Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 కంటే ఎక్కువ సీట్లు సాధించబోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకున్నట్లు ఆరోపించారు. ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో అమిత్ షా పలు విషయాలను పంచుకున్నారు.

Amit Shah On Lok Sabha Elections
Amit Shah On Lok Sabha Elections

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 8:36 AM IST

Amit Shah On Lok Sabha Elections :బీజేపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక విపక్షాలు ‘ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నాయని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ప్రతిపక్షాలకు ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. ఈశాన్యం నుంచి దక్షిణం వరకు ప్రతిపక్షాలు ఎన్ని గందరగోళాలు వ్యాప్తి చేసినా, బీజేపీ 400 కంటే ఎక్కువ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ వేవ్ ఉందని అభిప్రాయపడ్డారు. అసోంలోని గువాహటిలో ఈటీవీ భారత్ ప్రతినిధి అనామిత రత్నతో అమిత్ షా ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

"ఈ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ఘోర పరాభవం తప్పదు. ఆ విషయం వారికి తెలుసు. అందుకే ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేయడం వంటి చౌకబారు వ్యూహాలకు పాల్పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రంలోని ఎన్​డీఏ సర్కార్ తీవ్రంగా కృషి చేసిందని, దాని ఫలితంగానే అసోం ప్రజలు నేడు వీధుల్లో తిరగగలుగుతున్నారు."

--అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

మొదటి, రెండో దశలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా విపక్షాలపై మరోసారి చురకలంటించారు. ప్రతిపక్షపార్టీల మద్దతుదారులు ఇప్పటికే నిరాశలో కూరుకపోయారని, వారు ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడ్డారని ఎద్దేవా చేశారు. బీజేపీ మద్దతు ఓటర్లు మాత్రమే ఓటు వేయడానికి పోలింగ్ బూత్​కు వస్తున్నారని అన్నారు. అయితే మిగిలిన ఐదు దశల్లో అందరూ బయటకు వచ్చి ఓటువేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నట్లుగా నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఆరోపిస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈటీవీ భారత్​తో అమిత్ షా

'కంట్రోల్​ కోల్పోయిన అమిత్​ షా హెలికాప్టర్, గాల్లో ఊగిసలాట'- క్లారిటీ ఇచ్చిన కేంద్ర హోం శాఖ - Amit Shah Helicoptor Loses Control

బెంగళూరు కేఫ్​లో బాంబు పేలలేదు- కాంగ్రెస్ మైండ్ పేలింది: మోదీ - PM Modi Attack On Congress

ABOUT THE AUTHOR

...view details