Jharkhand NDA And INDIA Alliance :ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)- కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమైంది.
బీజేపీ ఎజెండా ఇదే!
- బంగ్లాదేశీల చొరబాటు, అవినీతి అంశాలే ఎజెండాగా ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ప్రచారం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు.
- మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టునూ ఎన్డీఏ కూటమి ప్రస్తావిస్తోంది.
- టికెట్ల ప్రకటనలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి జాబితాను అతి త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.
- పొత్తులో భాగంగా ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 9 నుంచి 11 స్థానాల్లో పోటీ చేయనుంది. నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు రెండు సీట్లను బీజేపీ ఇవ్వనుంది.
బలాలు
- ప్రచారంలో నేతల దూకుడు
- ఏజేఎస్‌యూతో పొత్తు
- రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రచారం
- గిరిజనుల్లో ప్రాబల్యమున్న చంపయీ సోరెన్ బీజేపీలో చేరడం.
- శిబూ సోరెన్ కోడలు సీతా సోరెన్ పార్టీలోకి రావడం
- గిరిజన నేత అర్జున్ ముండా పార్టీకి నాయకత్వం వహించడం.
బలహీనతలు
- రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి బీజేపీ కారణమని ప్రజలు భావించడం
- హేమంత్‌ను అరెస్టు చేయడం, ఆయన భార్య రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం
- మొత్తం 81 సీట్లలో 28 ఎస్టీలకు రిజర్వు కావడం. వాటిలో జేఎంఎం బలంగా ఉండటం