IRCTC Shirdi With Jyotirlinga Package : సమ్మర్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలి అనుకునేవారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. షిరిడీతో పాటు త్రయంబకేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు వీలుగా ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'షిరిడీ విత్ జ్యోతిర్లింగం' (SHIRDI WITH JYOTIRLINGA) పేరుతో టూర్ ప్యాకేజీని అందిస్తోంది. సికింద్రాబాద్ నుంచి ఈ యాత్రప్రారంభమై త్రయంబకేశ్వరం, పంచవటి, షిరిడీ సందర్శన తర్వాత తిరిగి సికింద్రాబాద్ చేరుకోవడంతో పూర్తవుతుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లు కొనసాగుతుంది. షిరిడీ విత్ జ్యోతిర్లింగం ట్రిప్ ప్రయాణానికి మే 7, 14, 21, 28 తేదీలలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ఐఆర్‌సీటీసీ షిరిడీ విత్ జ్యోతిర్లింగం టూర్ ప్రయాణం ఇలా :
- మొదటి రోజు హైదరాబాద్‌లో పర్యాటన ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 4:10 గంటలకు రైలు (నం.17208) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- తర్వాతి రోజు ఉదయం 6:15కు నాగర్‌సోల్ చేరుకుంటారు. అక్కడ ఐఆర్‌సీటీసీ పికప్ చేసుకుని ముందుగా బుక్ చేసిన హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి నాసిక్ (త్రయంబకేశ్వరం, పంచవటి) తీసుకెళ్తారు.
- అక్కడి నుంచి సాయంత్రం షిరిడీకి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయాలి.
- మూడవ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత షిరిడీ ఆలయ దర్శనానికి ఏర్పాట్లు చేస్తారు. తర్వాత కొన్ని గంటలు అక్కడే ఉండి స్థానికంగా ఉండే వివిధ ఆలయాలను సందర్శించవచ్చు.
- తర్వాత సాయంత్రం 6:30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 7:30 గంటలకు తిరుగు ప్రయాణం చేయడానికి రైలు (ట్రైన్ నం. 17205) ఎక్కాలి.
- నాలుగోరోజున ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధర :
- కంఫర్ట్: ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.12వేల 840, ట్విన్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10వేల 250 చెల్లించాలి.
- స్టాండర్డ్: సింగిల్ షేరింగ్ అయితే రూ.11వేల 080, ట్విన్, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.8వేల 500 చెల్లించాలి.
- అలాగే 5-11 సంవత్సరాల మధ్య చిన్నారులకు ఛార్జీలు ఉన్నాయి.