తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్‌ సీట్లు- భారత్‌లోనే 2036 ఒలింపిక్స్‌!'- ప్రధాని మోదీ - Independence Day 2024

Independence Day 2024 LIVE updates
Independence Day 2024 LIVE updates (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 6:37 AM IST

Updated : Aug 15, 2024, 9:01 AM IST

Independence Day 2024 LIVE updates:78వ స్వాతంత్ర్య దినోత్సవాలకు యావత్‌ భారతావని ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది సేపట్లో దిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాఎగుర వేయనున్నారు. ఎర్రకోట వద్ద ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ నేతృత్వంలోని బృందం స్వాగతం పలకనుుంది. తర్వాత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరిస్తారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేయనున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్లు ద్వారా పూల వర్షం కురిపించనున్నారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, వికసిత భారత్‌ లక్ష్య సాధనలో భాగంగా 2047నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, అందుకు కార్యాచరణను వివరించనున్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు పతాకావిష్కరణ చేసిన కాంగ్రెసేతర పార్టీల ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోదీ నిలుస్తున్నారు. ఈ వేడుకలకు దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అతిథుల్లో రైతులు, యువత, మహిళలు సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది అథ్లెట్లు, క్రీడాకారులు కూడా వేడుకల్లో పాల్గొంటారు.

LIVE FEED

8:53 AM, 15 Aug 2024 (IST)

  • మహిళలపై అఘాయిత్యాలు చేస్తే కఠిన చర్యలు: ప్రధాని మోదీ
  • మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం: ప్రధాని
  • ఇండియా 5జీతోనే ఆగదు, 6జీ పైనా అధ్యయనం కొనసాగుతోంది: ప్రధాని
  • గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా భారత్‌ను తయారుచేస్తాం: ప్రధాని
  • పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్రాలు నూతన విధానాలు రూపొందించాలి: ప్రధాని
  • పెట్టుబడిదారుల్లో విశ్వాసం కలిగించేలా శాంతిభద్రతలు, సుపరిపాలన ఉండాలి: ప్రధాని
  • 2036లో ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలన్న ఆశయం దిశగా అడుగులు: ప్రధాని

8:40 AM, 15 Aug 2024 (IST)

  • ఒకప్పుడు మొబైల్‌ ఫోన్లు దిగుమతి చేసుకునేవాళ్లం, ఇప్పుడు భారత్‌లోనే తయారీ: ప్రధాని
  • విద్య కోసం విదేశాలకు వెళ్లే దుస్థితిని తప్పిస్తాం
  • వైద్య విద్య కోసం లక్షలు ఖర్చుచేసి విదేశాలకు వెళ్తున్నారు: ప్రధాని
  • వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్‌ సీట్లు రాబోతున్నాయి: ప్రధాని
  • చంద్రయాన్‌ ప్రయోగం యువతలో శాస్త్రీయ ఆసక్తిని పెంచింది: ప్రధాని

8:29 AM, 15 Aug 2024 (IST)

  • ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప్రధాని మోదీ
  • మన కలలు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు: ప్రధాని
  • నూతన నేర చట్టాల్లో శిక్షల కంటే న్యాయానికే ప్రాధాన్యత ఇచ్చాం: ప్రధాని
  • ప్రభుత్వ ప్రమేయం అతితక్కువగా ఉండేలా పౌరసేవలు: ప్రధాని
  • ఎగుమతుల్లో పురోగతితో ప్రపంచ ప్రగతిలో భారత్‌ పాత్ర పెరిగింది: ప్రధాని

8:17 AM, 15 Aug 2024 (IST)

  • అంతరిక్ష రంగంలో భారత్‌ బలమైన శక్తిగా ఎదిగింది: ప్రధాని
  • అంతరిక్ష రంగంలో వందలకొద్దీ స్టార్టప్‌లు వచ్చాయి: ప్రధాని
  • ప్రైవేటు ఉపగ్రహాలు, రాకెట్లు ప్రయోగిస్తున్నారు: ప్రధాని మోదీ
  • మరో 10 కోట్లమంది మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరారు: ప్రధాని
  • మౌలిక సదుపాయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాం: ప్రధాని
  • దేశ హితమే ప్రథమ ప్రాధాన్యం: ప్రధాని నరేంద్రమోదీ

8:07 AM, 15 Aug 2024 (IST)

  • భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుంది: ప్రధాని
  • దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం: ప్రధాని
  • ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించాం: ప్రధాని
  • యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి: ప్రధాని
  • అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తాం: ప్రధాని
  • భారత్‌ త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది: ప్రధాని
  • స్వయం సహాయక రంగాలకు ఇప్పటివరకు 9 లక్షల కోట్లు రుణాలిచ్చాం: ప్రధాని
  • కోటిమంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తాం: ప్రధాని

8:02 AM, 15 Aug 2024 (IST)

  • అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నాం: ప్రధాని
  • 'నేషన్‌ ఫస్ట్‌ రాష్ట్ర్‌ హిత్‌ సుప్రీం' సంకల్పంతో ముందుకెళ్తున్నాం: ప్రధాని
  • బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో సంస్కరణలను అమలు చేశాం: ప్రధాని
  • భారత్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైంది: ప్రధాని
  • జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 15 కోట్లమందికి లబ్ధి చేకూరింది: ప్రధాని
  • భారత్‌ చిరుధాన్యాలు ప్రపంచంలోని అందరికీ చేరాలి: ప్రధాని

7:56 AM, 15 Aug 2024 (IST)

  • మనం అనుకుంటే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది: ప్రధాని
  • 'వికసిత్‌ భారత్‌ 2047' నినాదం 140 కోట్ల మంది కలల తీర్మానం: ప్రధాని
  • దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలి: ప్రధాని
  • వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది ప్రభుత్వ వ్యూహం: ప్రధాని మోదీ
  • వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పు తెచ్చింది: ప్రధాని
  • సర్జికల్‌ స్ట్రైక్స్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారు: ప్రధాని

7:48 AM, 15 Aug 2024 (IST)

  • 2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యం: ప్రధాని మోదీ
  • భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలి: ప్రధాని
  • తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ను మార్చాలి: ప్రధాని
  • ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలి: ప్రధాని
  • దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరం: ప్రధాని మోదీ
  • న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం: ప్రధాని మోదీ
  • అంతరిక్షంలో భారత స్పేస్‌ స్టేషన్‌ త్వరలో సాకారం కావాలి: ప్రధాని

7:42 AM, 15 Aug 2024 (IST)

ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ

  • భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని
  • శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గింది: ప్రధాని
  • స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారు: ప్రధాని
  • ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరింది: ప్రధాని
  • ఈ 140 కోట్ల జనం వారి కలలను సాకారం చేయాలి: ప్రధాని
  • లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి: ప్రధాని మోదీ
  • కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయి: ప్రధాని
  • విపత్తు బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి

7:33 AM, 15 Aug 2024 (IST)

  • దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని
  • ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం
  • వరుసగా 11వ సారి ప్రధానిగా జెండా ఎగురవేసిన మోదీ
  • 2047 వికసిత భారత్‌ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలు
  • వేడుకలకు దాదాపు 6 వేలమంది ప్రత్యేక అతిథులు
  • ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు

7:24 AM, 15 Aug 2024 (IST)

  • ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • రక్షణ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన ప్రధాని
  • ప్రధానికి రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్వాగతం

7:15 AM, 15 Aug 2024 (IST)

  • రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీకి ప్రధాని మోదీ నివాళులు
  • దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని
  • వరుసగా 11వ సారి ప్రధానిగా జెండా ఎగురవేయనున్న మోదీ
  • రక్షణ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించనున్న ప్రధాని మోదీ
  • గౌరవ వందనం తర్వాత త్రివర్ణ పతకాన్ని ఎగురవేయనున్న ప్రధాని
  • త్రివర్ణ పతాకావిష్కరణ వేళ హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం
  • పతాకావిష్కరణ అనంతరం ప్రసంగించనున్న ప్రధాని మోదీ

7:09 AM, 15 Aug 2024 (IST)

ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

6:51 AM, 15 Aug 2024 (IST)

రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ ఆయన అధికారిక నివాసం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మరోవైపు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ​ ఎర్రకోట వద్దకు చేరుకున్నారు.

Last Updated : Aug 15, 2024, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details