How To Prepare Chicken Fry At Home : చికెన్‌తో ఎన్నో రకాల వంటకాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ, ఎన్నిసార్లు వండినా కూడా మళ్లీ మళ్లీ తినాలనిపించే కర్రీ మాత్రం చికెన్ ఫ్రై మాత్రమే! బాగా మసాలాలు వేసి ఒక్కసారి చికెన్ ఫ్రై రెడీ చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇదిలా ఉంటే చాలా మంది చికెన్ఫ్రైకి కాంబినేషన్‌గా పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకుంటారు. అయితే ఎప్పుడూ చేసే పచ్చిపులుసు కాకుండా మామిడికాయతో పచ్చిపులుసును తయారు చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. మరి ఈ వంటలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
చికెన్ ఫ్రై చేయడానికి కావాల్సిన పదర్థాలు :
- బోన్‌లెస్ చికెన్ - అర కిలో
- కారం- రుచికి సరిపడా
- పసుపు- ఒక చిన్న టేబుల్ స్పూన్
- ఉప్పు -రుచికి సరిపడా
- ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
- జీడిపప్పు - 5
- దాల్చిన చెక్క - కొద్దిగా
- లవంగాలు - 4
- ఎండు మిరపకాయలు - నాలుగు
- జీలకర్ర - 1 టీస్పూన్
- మిరియాలు -1/2 టీస్పూన్
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు - రెండు
- పెరుగు - కప్పు
- పచ్చిమిర్చి - నాలుగు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు
చికెన్ ఇలా చుట్టేసి ఇవ్వండి - పిల్లలు "మమ్మీ యమ్మీ" అంటూ లాగిస్తారు!
చికెన్ ఫ్రై తయారు చేయు విధానం :
- ముందుగా ఓ గిన్నెలోకి చికెన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం, పసుపు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ధనియాలు, జీడిపప్పు, దాల్చినచెక్క, లవంగాలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు వేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌పై ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి.
- తర్వాత మారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కప్పు పెరుగు వేసి మిక్స్ చేయాలి.
- తర్వాత మూతపెట్టి చికెన్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
- చికెన్ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. అంతే సింపుల్‌గా చికెన్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు.