PM Kisan 18th Installment Status:అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకం 18వ విడత నిధులు విడుదల అయ్యాయి. మహారాష్ట్రలోని వాశిమ్లో ప్రధాని నరేంద్ర మోదీ నిధులు రిలీజ్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9.4 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరినట్లు ఆయన వివరించారు. మరి ఆ లబ్ధిదారుల్లో మీరు ఉన్నారేమో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.
స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి:
- ఫస్ట్ మీరు www.pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- తర్వాత వెబ్‌సైట్‌లోని "Beneficiary List" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి.
- లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి.
ఈ జాబితాలో పేరు ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు పడ్డట్టే. ఆ స్టేటస్ ఇలా తెలుసుకోండి.
- ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్‌ను ఓపెన్ చేయండి.
- ఇప్పుడు Know Your Status అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
- ఇప్పుడు Get OTP ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్ చేస్తే స్క్రీన్‌పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.
- ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని అర్థం.