IIIT Student Made Health Monitor Smartwatch : ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి పంకజ్ కుమార్ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను రూపొందించాడు. ధరించిన వ్యక్తి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని అతడి కుటుంబసభ్యులు, వైద్యులకు తెలిసేలా ఓ వాచ్‌ను తయారు చేశాడు. ఈ వాచ్‌ను రూపొందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50లక్షల గ్రాంటును సైతం పొందాడు. ఈ వాచ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌ల కంటే తక్కువ ధర ఉంటుందని పంకజ్ చెబుతున్నాడు. ఈ వాచ్‌లో ఆపద సమయాల్లో కుటుంబసభ్యులకు అలర్ట్ మెసేజ్‌లు, లోకేషన్‌ను పంపించే సదుపాయాన్ని కల్పించాడు.
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పంకజ్ కుమార్ ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ చేస్తున్నాడు. ఒకవైపు చదువుతూనే, మరోవైపు వృద్ధుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలానే ఉద్దేశంతో ఓ స్మార్ట్ వాచ్‌ను రూపొందించాడు. దీంతో పాటు ఏదైనా విపత్కర సమయంలో అనారోగ్యానికి గురైనా వెంటనే సమాచారాన్ని వైద్యులు, కుటుంబసభ్యుల మొబైల్‌కు చేరవేస్తుంది. ప్రస్తుతం తయారీ చేసిన ఈ నమూనాను పరీక్షిస్తున్నారు. ఇది 2025నాటికి మార్కెట్లో లాంఛ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ వాచ్‌కు మరిన్ని తుదిమెరుగులు దిద్దుతున్నట్లు పంకజ్ తెలిపారు.