తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరల్ అవుతున్న గూగుల్ డూడుల్ - మీరు చూశారా? - దాని అర్థమేంటో తెలుసా? - Earth Day 2024 Google Doodle - EARTH DAY 2024 GOOGLE DOODLE

Earth Day 2024 Google Doodle : మీరు ఈ రోజు గూగుల్ ఓపెన్ చేయగానే డూడుల్ కనిపించిందా? దాన్ని​ పరిశీలించారా? మరి.. అదేంటో అర్థమైందా? ఎర్త్ డే 2024 సందర్భంగా.. గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ డూడుల్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Google Doodle
Earth Day 2024 Google Doodle

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 2:39 PM IST

Google Doodle on Earth Day 2024 :ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 22న ఎర్త్​ డే దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ సంవత్సరం గూగుల్(Google).. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన డూడుల్​ను ఆవిష్కరిస్తుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 22(ఇవాళ) ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని.. అందరినీ ఆకర్షించేలా సరికొత్త డూడుల్​ను రూపొందించింది. ఆ డూడుల్.. భూమిని భద్రంగా ఉంచితేనే మానవ మనుగడ అని గుర్తు చేసేలా అద్భుతమైన సందేశాన్ని ఇస్తోంది.

ధరిత్రి దినోత్సవం 2024 సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ డూడుల్​ చూడ్డానికి ఫొటోల్లాగే కనిపిస్తున్నా.. అందులో 'G O O G L E’ అనే అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని కొద్దిసేపు ప్రత్యేకంగా గమనిస్తే ఆ అక్షరాలను చూడొచ్చు. అయితే.. చాలా మందికి అవి ఫొటోషాప్​లో ఎడిట్ చేసిన చిత్రాలుగా అనిపించే ఛాన్స్ ఉంది. కానీ, అవి ఎడిట్ చేసిన చిత్రాలు కాదు. భూమిపై నిజంగా ఉన్న ప్రదేశాలే అవి.

వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో గుర్తుచేసేలా.. ఎర్త్ డే 2024 సందర్భంగా గూగుల్(Google) ఈ ప్రత్యేక డూడుల్‌ను తీసుకొచ్చింది. ఇందులో కనిపిస్తున్న ఒక్కో అక్షరం ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తోందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు ఆ ప్రాంతాలు కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి మార్పులకు లోనయ్యాయో వివరించేలా.. శాటిలైట్‌ చిత్రాల ద్వారా యానిమేషన్‌ను కూడా జోడించింది గూగుల్. ఆ డూడుల్‌పై క్లిక్‌ చేస్తే మీరు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు పొందవచ్చు. ఇకపోతే ఈ డూడుల్​లోని అక్షరాలకు అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.

PHD చేస్తారా? నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేస్తే చాలు- PG అక్కర్లేదు! - UGC NET Exam Rules

  • G : డూడుల్​లో కనిపిస్తున్న తొలి అక్షరం 'G'ని పోలి ఉన్న ప్రదేశం.. టర్క్స్‌ అండ్‌ కైకోస్‌ దీవులు. ఈ ప్రాంతం అట్లాంటిక్‌ మహాసముద్రంలోని అంతరించిపోతున్న అనేక జీవులకు రక్షణగా ఉంటోంది. అంతేకాదు, ఈ ప్రదేశం జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉంది.
  • O : డూడుల్​లోని రెండో అక్షరం 'o' మెక్సికోలోని స్కార్పియన్‌ రీఫ్‌ నేషనల్‌ పార్క్​ని సూచిస్తుంది. పగడపు దిబ్బలకు ప్రసిద్ధి చెందిన ఈ జీవావరణ కేంద్రం యునెస్కో గుర్తింపు పొందింది. ఇది అంతరించిపోతున్న అనేక పక్షులు, తాబేళ్లకు కేంద్రంగా ఉంది.
  • O : ఐస్‌లాండ్‌లోని వట్నాజోకుల్ నేషనల్ పార్క్‌కు సంబంధించిన ప్రాంతాన్ని సూచిస్తుంది డూడుల్​లోని మూడో చిత్రం. ఇది కూడా యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు పొందింది. అగ్నిపర్వతాలు, మంచు మిశ్రమంతో అరుదైన ప్రకృతి దృశ్యాలు, వృక్షజాలానికి నెలవుగా ఈ ప్రాంతం ఉంది.
  • G : డూడుల్​లోని నాలుగో చిత్రం బ్రెజిల్‌లోని జౌ నేషనల్‌ పార్క్‌. అమెజాన్‌ అడవుల మధ్యలోని ఈ ప్రాంతం అనేక అరుదైన జంతువులకు నివాసంగా ఉంది.
  • L : నైజీరియాలోని గ్రేట్‌ గ్రీన్‌వాల్​ను సూచిస్తుంది డూడుల్‌లో ‘ఎల్‌’ చిత్రం. ఈ ప్రాంతంలో ఎడారికీకరణ వల్ల కోల్పోయిన వైభవాన్ని మొక్కలు నాటడం ద్వారా పునరుద్ధరిస్తున్నారు. స్థానిక ప్రజలకు ఇది ఉపాధి కల్పిస్తోందట.
  • E : ఇక చివరగా డూడుల్​లోని లాస్ట్ పిక్చర్.. ఆస్ట్రేలియాలోని పిల్బరా ఐలాండ్స్‌ నేచర్‌ రిజర్వ్స్‌కు సంబంధించిన ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇది ఆంగ్ల అక్షరమైన ‘e’ని పోలి ఉంది. అనేక సముద్ర తాబేళ్లు, పక్షులు సహా పలు జీవులకు ఈ ప్రాంతం నివాస స్థలంగా ఉంది.
  • ఆయా ప్రాంతాల ప్రాశస్త్యాన్ని కాపాడేందుకు వివిధ సంస్థలు, స్థానికులు కలిసి చేస్తున్న కృషిని గుర్తిస్తూ గూగుల్‌ (Google).. ఈ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించడం విశేషం.

'బస్సు అంత పొడవున్న పాము'- ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ అవశేషాలను కనుగొన్న సైంటిస్ట్​లు

ABOUT THE AUTHOR

...view details