Gujarat Devotees Chardham Yatra On Bicycle :అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్న ఓ వ్యక్తి కోసం ప్రార్థించడానికి సైకిల్‌పై చార్ధామ్ యాత్రను చేపట్టారు తండ్రీకూతుళ్లు. 8ఏళ్ల కుమార్తెతో కలిసి గుజరాత్ నుంచి చార్ధామ్ యాత్రను చేపట్టారు అశోక్ జీనా భాయ్. ఇంతకీ ఎనిమిదేళ్ల వయసు ఉన్న కుమార్తెతో కలిసి అశోక్ సైకిల్‌పై చాలా దూరంలో యాత్రాస్థలాలను ఎందుకు దర్శించుకుంటున్నారు? ఈ యాత్ర వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అనేవి తెలియాలంటే ఈ స్టోరీ చదవేయాల్సిందే.
'ఆయనే కోసమే ప్రార్థిస్తున్నాం'
గుజరాత్‌కు చెందిన 8ఏళ్ల కంగర్ కృష్ణ అశోక్ భాయ్ అనే బాలిక తన తండ్రి అశోక్ జీనా భాయ్‌తో కలిసి ఇటీవల సైకిల్‌పై గుజరాత్ నుంచి ఉత్తరాఖండ్‌కు బయలుదేరింది. తాజాగా బద్రీనాథ్‌లో దైవ దర్శనాన్ని తండ్రీకూతుళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో "ఈటీవీ భారత్"తో మాట్లాడి సైకిల్ యాత్ర గురించి పలు విషయాలను పంచుకున్నారు అశోక్ జీనా భాయ్. గుజరాత్లో పేదలకు సాయం చేస్తున్న సామాజిక కార్యకర్త నితిన్ జానీ కోసం ఏదైనా చేయాలని చార్ధామ్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.
ఈ యాత్రలో నితిన్ జానీ కోసం ప్రార్థిస్తామని చెప్పారు. చార్ధామ్ యాత్ర చేపట్టడానికి తన కుమార్తె కంగర్ కృష్ణ తనను ప్రేరేపించిందని పేర్కొన్నారు. "నితిన్ జానీ చేసిన సేవకు మొదట నా కూతురు కంగర్ కృష్ణ అశోక్ భాయ్ ఆకర్షితురాలైంది. ఈ తర్వాత నితిన్ జానీ గురించి నాతో చెప్పింది. అప్పుడే నితిన్ జానీ గురించి ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో చార్ధామ్ యాత్రకు బయలుదేరాను" అని అశోక్ జీనా భాయ్ తెలిపారు.