తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరగనున్న ఔషధాల ధరలు- పెయిన్‌కిల్లర్‌, యాంటీబయాటిక్స్‌ మరింత ప్రియం! - Essential Medicines Price Hike - ESSENTIAL MEDICINES PRICE HIKE

Essential Medicines Price Hike : ఏప్రిల్‌ 1 నుంచి పలు అత్యవసర ఔషధాలు ధరలు పెరగనున్నాయి. యాంటీబయాటిక్స్‌, పెయిన్‌కిల్లర్స్‌ వంటి పలు రకాల మందుల ధరలను 0.0055శాతం పెంచారు.

Essential Medicines Price Hike
Essential Medicines Price Hike

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 10:17 PM IST

Essential Medicines Price Hike :నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామన్యులపై మరింత భారం పడనుంది! 923 రకాల ఫార్ములాలతో కూడిన అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్ నుంచి మరింత పెరగనున్నాయి. ఇందులో పెయిన్‌కిల్లర్లు, యాంటిబయాటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్స్‌ మందులు ఉన్నాయి. ఈ మేరకు జాతీయ ఔషధాల ధరల సంస్థ (National Pharmaceutical Pricing Authority- NPPA) వెల్లడించింది. ఈ మేరకు ఎన్​పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్​లో మందుల 'టోకు ధరల సూచీ' (Wholesale Price Index-WPI)లో వార్షిక మార్పును ప్రకటించింది.

కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ వెల్లడించిన టోకు ద్రవ్యోల్బణ సూచీ గణాంకాల ప్రకారం, 2023 సంవత్సరానికి గానూ మందుల టోకు ధరల సూచీని ఎన్‌పీపీఏ తాజాగా వెల్లడించింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సూచీ 0.0055 శాతం పెరిగినట్లు పేర్కొంది. అంటే. అత్యవసర జాబితాలో ఉండే ఔషధాల ధరలు 0.0055 శాతం పెరగనున్నాయి. ఈ పెంపు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులతో, మందుల తయారీదారులు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే WPIలో సూచించిన ధరలకు అనుగుణంగా షెడ్యూల్​ చేసిన ఫార్ములాల మందులపై MRPని పెంచొచ్చు. ఇందులో యాంటీబయాటిక్స్, యాంటీమలేరియల్స్ మరియు టైప్ 2 డయాబెటిస్‌కు మందులు వంటి ముఖ్యమైన మందులు ఉన్నాయి. పెరిగిన ధరల ప్రకారం పెయిన్‌కిల్లర్ అయిన డైక్లోఫెనాక్ (Diclofenac) ఇప్పుడు ఒక్కో టాబ్లెట్ ధర రూ. 2.05 ఉంటుంది. అయితే ఇబుప్రోఫెన్ (Ibuprofen) టాబ్లెట్‌ల ధర రూ.71(200 Mg), రూ.1.20 (400 Mg) ఉంటుంది.

మందులు వాడటం మధ్యలో ఆపేస్తే ఏం అవుతుంది?
ఈరోజుల్లో ఎక్కువ మంది బీపీ ప్రాబ్లమ్​​తో బాధపడుతున్నారు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి డైలీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు. అయితే కొందరు బీపీ మెడిసిన్స్​ను మధ్యలో ఆపేస్తుంటారు. కానీ అలా మానేయడం వల్ల ఆరోగ్యం పెద్ద ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల హార్ట్​ స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, ఆప్టిక్ నరాలు దెబ్బతిని ప్రాణాల మీదకు రావొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి మందులూ వాడకుండానే - హైబీపీ తగ్గించుకోండిలా!

మలబద్ధకం నివారణ కోసం మందులు వాడుతున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!

ABOUT THE AUTHOR

...view details