Rs 10 lakh insurance for auto drivers :అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆటో డ్రైవర్లపై ఆమ్ ఆద్మీ పార్టీ-ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు. దిల్లీ ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించారు. దీంతో పాటు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్ల కూతుళ్ల పెళ్లిళ్లకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆటోవాలాలకు యూనిఫాం అలవెన్స్ కింద ఏడాదికి రెండు సార్లు రూ.2,500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్ల పిల్లలకు ఉచిత కోచింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం కోండ్లి నియోజకవర్గంలోని ఓ ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులతో కేజ్రీవాల్ మధ్యాహ్న బోజనం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం హామీలు ప్రకటించారు.
ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - ఏడాదికి రూ.5000- ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1 లక్ష సాయం - RS10 LAKH INSURANCE AUTO DRIVERS
ఆటో డ్రైవర్లపై అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం - రూ.10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ - ఏడాది రూ.5000 యూనిఫాం అలవెన్స్ - ఆడపిళ్లల పెళ్లిళ్లకు రూ.1 లక్ష ఆర్థిక సాయం

Published : Dec 10, 2024, 5:26 PM IST
ఈ సందర్భంగా 'పూచో' యాప్‌ను ప్రారంభించారు అరవింద్ కేజ్రీవాల్. రిజిస్టర్డ్ ఆటో డ్రైవర్ల మొబైల్ నంబర్స్‌తో ఓ డేటాబేస్‌ను దిల్లీ ఇంటిగ్రేడెట్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు డ్రైవర్ నంబర్‌కు కాల్ చేసి రైడ్ బుక్ చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా, దిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ స్థానాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌తో హోరాహోరీగా పోరాడుతున్న ఆప్, వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోంది.