Delhi Congress Releases 3rd List : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తమ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 16 మంది పేర్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణతీర్థ్ పటేల్ నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కౌన్సిలర్ ఆరిబాఖాన్‌కు ఓఖ్లా అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం దక్కింది.
గోకల్‌పుర్ ఎస్సీ నియోజకవర్గంలో తొలుత ప్రమోద్ కుమార్ జయంత్ పేరు ప్రకటించగా, ఆయన స్థానంలో ఈశ్వర్ బాగ్రీ పోటీ చేస్తారని తాజాగా హస్తం పార్టీ వెల్లడించింది. మొత్తం 70 నియోజకవర్గాలకుగానూ ఇప్పటివరకు 63 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి.