తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాయంత్రం వేళ - కరకరలాడే "చైనీస్ భేల్ పూరి" - నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు! పైగా టేస్ట్​ సూపర్​! - Chinese Bhel Puri Recipe - CHINESE BHEL PURI RECIPE

Chinese Bhel Puri Recipe in Telugu : ఈ చల్ల చల్లని సాయంత్రం వేళ మంచి స్నాక్ రెసిపీ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీకోసం ఒక మంచి సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. కరకరలాడే స్ట్రీట్ స్టైల్ చైనీస్ భేల్ పూరి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..!

How To Make Street Style Chinese Bhel
Chinese Bhel Puri Recipe in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 10:07 AM IST

How To Make Street Style Chinese Bhel At Home :చాలా మందికి సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్(Snack) ప్రిపేర్ చేసుకొని తినే అలవాటు ఉంటుంది. మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే, మీకోసం అద్దిరిపోయే ఒక చైనీస్ స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. కరకరలాడే చైనీస్ భేల్ పూరి. ఇది రుచిలో బయట దొరికే చైనీస్ భేల్ పూరికి ఏ మాత్రం తీసిపోదు! పైగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని పిల్లలైతే మహా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇంట్లో ఓసారి ఈ చైనీస్ భేల్ పూరిని ట్రై చేయండి.

చైనీస్ భేల్​ తయారీకి కావాల్సినవి :

  • నూడుల్స్ - 1 Bundle(చుట్ట)
  • కార్న్​ ఫ్లోర్ - 5 టేబుల్ స్పూన్లు
  • నూడుల్స్​ని ఉడికించడానికి సరిపడా - వాటర్
  • నూనె - తగినంత
  • ఉప్పు - కొద్దిగా

వెజ్జీస్ వేపుకోవడానికి కావాల్సినవి :

  • ఆయిల్ - 4 టేబుల్ స్పూన్లు
  • వెల్లుల్లి తరగు - 1 టేబుల్ స్పూన్
  • అల్లం - 1 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
  • సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు - పావు కప్పు
  • సన్నగా తరిగిన గ్రీన్ క్యాప్సికం ముక్కలు - పావు కప్పు
  • సన్నగా తరిగిన ఎల్లో క్యాప్సికం ముక్కలు - పావు కప్పు
  • సన్నగా తరిగిన క్యాబేజీ తరుగు - ఒకటిన్నర కప్పు
  • మిరియాల పొడి - పావు టీస్పూన్
  • సాల్ట్ - కొద్దిగా

భేల్ తయారీకి కావాల్సినవి :

  • రెడ్ చిల్లీ సాస్ - 1 టేబుల్​స్పూన్
  • చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
  • గ్రీన్ చిల్లీ సాస్ - అర టేబుల్​స్పూన్
  • ఉప్పు - చిటికెడు
  • టమాట సాస్ - 1 టేబుల్​స్పూన్
  • వేయించుకున్న పల్లీలు - 3 టేబుల్​స్పూన్లు
  • వెనిగర్ - అర టీస్పూన్
  • సోయా సాస్ - అర టీస్పూన్
  • చైనీస్ చిల్లీ పేస్ట్ - 1 టీస్పూన్
  • షేజ్వాన్ సాస్ - 1 టేబుల్​స్పూన్
  • స్ప్రింగ్​ ఆనియన్స్​ - 2 టేబుల్​స్పూన్లు

చైనీస్ భేల్ తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై ఒక బౌల్​ పెట్టి నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి. అవి కాస్త హీట్ అయ్యాక కొద్దిగా ఉప్పు, నూడుల్స్ వేసి హై ఫ్లేమ్ మీద 90% వరకు ఉడికించుకోవాలి. మీరు నూడుల్స్ ఎంచుకునేటప్పుడు మంచి క్వాలిటీవి తీసుకోవడం మంచివి.
  • అలా ఉడికాయనుకున్నాక వెంటనే వాటిని నీటి నుంచి వేరు చేసి జల్లెడలో వేసుకోవాలి. ఆపై వాటిపై కాస్త ఆయిల్ వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఎందుకంటే.. వేడి మీద కార్న్ ఫ్లోర్ కలుపుకుంటే నూడుల్స్ మెత్తగా అవ్వడమే కాకుండా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే.. కార్న్ ఫ్లోర్ కోటింగ్ కూడా సరిగ్గా పట్టుకోదు.
  • నూడుల్స్​ని పూర్తిగా చల్లార్చుకున్నాక వాటిపై కార్న్​ఫ్లోర్ ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా వేసుకుంటూ మిశ్రమం మొత్తానికి పట్టేలా కోట్ చేసుకోవాలి.
  • తర్వాత స్టౌపై కడాయి పెట్టుకుని నూడుల్స్ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆపై అది కాస్త వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్ మంట మీద కార్న్​ఫ్లోర్ కోట్​ చేసిన నూడుల్స్​ను నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని.. పక్కకు పెట్టుకోవాలి.

రెస్టారెంట్ స్టైల్​లో క్రిస్పీ కార్న్ - నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

  • ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ తీసుకొని కాస్త ఆయిల్ పోసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక అల్లం వెల్లులి తరుగు, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమంలో ఉల్లిపాయ, క్యారెట్, రెడ్​ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం అందులో క్యాబేజీ తరుగు వేసి మరో 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా పైపైన వేయించుకున్న వెజ్జీస్​లో కాస్త మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • ఆపై స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత భేల్ కోసం పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అలా తయారు చేసుకున్నాక ముందుగా వేయించుకొని పెట్టుకున్న నూడుల్స్​ని నెమ్మదిగా కారపూసలాగా చిదిమి ఆ మిశ్రమంలో వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. అలాగే చివర్లో కొద్దిగా స్ప్రింగ్​ ఆనియన్స్​ వేసుకుని కలుపుకుంటే చాలు.
  • ఎంతో టేస్టీగా ఉండే.. కరకరలాడే చైనీస్ భేల్ పూరీ రెడీ!

స్ట్రీట్​ ఫుడ్​ టేస్ట్ ఇంట్లో! - ఉల్లి పకోడీలు ఇలా చేసుకుంటే అద్దిరిపోతాయి!

ABOUT THE AUTHOR

...view details