తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్- ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ఆరుగురు హతం - Chhattisgarh Naxal Encounter

Chhattisgarh Naxal Encounter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Chhattisgarh Naxal Encounter
Chhattisgarh Naxal Encounter

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 11:02 AM IST

Updated : Mar 27, 2024, 12:07 PM IST

Chhattisgarh Naxal Encounter : ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళతో సహా ఆరుగురు నక్సల్స్ మరణించారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. చికుర్​బత్తి - పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్​ ఆపరేషన్​ను చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు బస్తర్​ రేంజ్ ఐజీ సుందర్​రాజ్​ తెలిపారు. 'కాల్పుల ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలకు కూడా తీసున్నాం. కాల్పుల్లో పలువురు నక్సలైట్లు గాయపడ్డారు. ఇంకా బీజాపుర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి' అని సుందర్ రాజ్​ వెల్లడించారు.

ఎన్నికల వేళ ఎన్​కౌంటర్​
బీజాపుర్‌ జిల్లా బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్‌ 19న తొలి విడతలోనే పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు యాంటీ-నక్సల్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

మహారాష్ట్రలో ఎన్​కౌంటర్
ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు నక్సలైట్లు మరణించారు. మరణించిన నలుగురూ తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టులుగా అధికారులు గుర్తించారు. గడ్చిరోలి జిల్లాలో 60 కమాండర్లతో ఆపరేషన్​ జరిగిందని తెలిపారు.

ముగ్గురు భద్రతా సిబ్బంది వీరమరణం
ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లోనే ఇలాంటి ఘటన జరిగింది. భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన సుక్మా- బీజాపుర్​లో సరిహద్దులో జరిగింది. టేకులగూడలో నక్సలైట్లను ఏరిపారేసేందుకు ఆపరేషన్​ను చేపట్టారు. ఈ క్రమంలోనే వారిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. భద్రతా దళాలు సైతం ధీటుగా స్పందించాయి. నక్సల్స్, భద్రతా దళాలు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

గర్భగుడిలో అగ్నిప్రమాదం- పూజారులకు గాయాలు- హోలీ రంగులే కారణం! - Ujjain Mahakal Temple Fire

లారీతో తొక్కించి ఐదుగురి హత్య- ఘర్షణపై కేసు పెట్టేందుకు వెళ్తుండగానే - Rajasthan Murder Case

Last Updated : Mar 27, 2024, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details