తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లోనే ఈజీగా "బటర్ స్కాచ్" ఐస్​క్రీమ్ రెడీ చేసుకోండి - ఎండల్లో హాయ్ హాయ్! - Butterscotch Ice Cream Recipe

Butterscotch Ice Cream Recipe : పైన ఎండలు మండిపోతున్నప్పుడు.. గొంతులోకి చల్లగా ఏది జారినా ఆహాఁ అనిపిస్తుంది. ఇక అది ఐస్​క్రీమ్​ అయితే చెప్పాల్సిన పనేలేదు. అందుకే మీకోసం ఈ రెసిపీ. ఈ సమ్మర్​లో అద్దిరిపోయే బటర్ స్కాచ్​ ఫ్లేవర్​ను ఇంట్లోనే రెడీ చేస్కోండి! యమ్మీ యమ్మీ అంటూ ఆస్వాదించండి!

How to Make Butterscotch Ice Cream
Butterscotch Ice Cream Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 1:44 PM IST

How to Make Butterscotch Ice Cream Recipe : వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చల్లని పదార్థాలను తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది బయటకు వెళ్లినప్పుడు ఐస్​క్రీమ్(​Ice Cream) తినడానికి మొగ్గుచూపుతుంటారు. అయితే, ప్రతిసారీ బయటినుంచి తెచ్చుకోవడం ఎందుకు.. ఈ సారి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఇందుకోసం బటర్ స్కాచ్ రెసిపీని తీసుకొచ్చాం. మరి.. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

బటర్ స్కాచ్ ఐస్​క్రీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • పాలు
  • పాలమీగడ
  • నెయ్యి
  • చక్కెర
  • కస్టర్డ్ పౌడర్
  • జీడిపప్పు
  • బటర్ ఎసెన్షన్
  • ఫుడ్ కలర్

సమ్మర్ స్పెషల్ : నోరూరించే మునక్కాయ బిర్యానీ - ఇలా ప్రిపేర్​ చేయండి - కుమ్మేస్తారంతే!

బటర్ స్కాచ్ ఐస్‌క్రీమ్ తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై ఒక ప్యాన్​ పెట్టుకొని అందులో అరలీటర్ పాలు పోసుకోవాలి. అవి ఒక పొంగు వచ్చేవరకు వేడి చేసుకోవాలి.
  • ఇప్పుడు మరో బౌల్​ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి.
  • ఆ తర్వాత దానిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మరికొన్ని పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా ఆ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి, మరుగుతున్న పాలలో పావు కప్పు చక్కెర వేసి మిక్స్ చేసుకోవాలి.
  • ఇప్పుడు.. చక్కెర కరిగి ఐదు నిమిషాలయ్యాక మీరు ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్​ను ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి.
  • ఇలా రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో ఆ మిశ్రమాన్ని ఉడికించుకున్న తర్వాత బట్టర్ స్కాచ్ ఎసెన్షన్ యాడ్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమం చిక్కగా మారేవరకు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని అందులో పావు కప్పు చక్కెర వేసుకోవాలి.
  • అది కరిగాక అర టీస్పూన్ వెన్న లేదా నెయ్యి కానీ యాడ్ చేసుకొని బాగా కరిగించుకోవాలి. అంటే.. క్యారమిల్​ లాగా ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత పావు కప్పులో సగం జీడిపప్పు పలుకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై స్టౌ ఆఫ్ చేసి వెంటనే నెయ్యి పూసిన ప్లేట్​లో వేసి దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక కవర్లో వేసి కర్రతో కొడితే బటర్ స్కాచ్ తయారవుతుంది.
  • ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకొని చల్లార్చుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని.. మిక్సీ జార్​లోకి తీసుకొని దానికి ఒక కప్పు పాల మీగడ వేసి మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత దాన్ని ఒక బాక్స్​లోకి తీసుకొని గంటపాటు ఫ్రిజ్​లో ఉంచుకోవాలి.
  • అనంతరం మళ్లీ మిక్సీ జార్​లోకి ఆ మిశ్రమాన్ని తీసుకొని దానికి ముందుగా రెడీ చేసుకున్న బటర్ స్కాచ్​ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
  • ఇప్పుడు మళ్లీ ఆ మిశ్రమాన్ని బాక్సులోకి తీసుకొని దానికి మూడు టేబుల్ స్పూన్ల వరకు బటర్ స్కాచ్ యాడ్ చేసుకొని దానిపై బటర్ పేపర్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి.
  • చివరగా దాన్ని డీప్ ఫ్రిజ్​లో ఉంచి తర్వాత రోజు తీసి చూస్తే నోరూరించే టేస్టీ టేస్టీ.. బటర్ స్కాచ్ ఐస్​క్రీమ్ రెడీ అయిపోతుంది!

సమ్మర్​లో టీ, కాఫీ వద్దు హెర్బల్ టీ ముద్దు - ఆ ప్రాబ్లమ్స్​ అన్నీ క్లియర్​! - Coriander Tea Health Benefits

ABOUT THE AUTHOR

...view details