తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 2:48 PM IST

ETV Bharat / bharat

OTP లేకుండానే ఫోన్​ పే లాగిన్- పేమెంట్​ యాప్​లో బగ్​ గుర్తించిన యువకుడు- సంస్థ రియాక్షన్ ఇదే! - PhonePe Bug

Bug Found In PhonePe : ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ ఫోన్​ పేలో బగ్​ను గుర్తించాడు బిహార్​కు చెందిన ఓ యువకుడు. ఓటీపీ లేకుండా ఫోన్​ పేలో ఎలా లాగిన్ కావొచ్చో కనుక్కొన్నాడు. ఈ విషయాన్ని ఫోన్​పేకు తెలియజేసి ప్రశంసలు పొందాడు.

PhonePe Bug
PhonePe Bug (ETV bharat)

Bug Found In PhonePe: దేశంలో కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగిపోయాయి. ప్రతిదానికీ యూపీఐ పేమెంట్స్​ చేస్తున్నారు. చిన్నచిన్న షాపులు మొదలు పెద్ద స్థాయిలో నిర్వహించే వ్యాపారాల వరకూ, యూపీఐ పేమెంట్స్​ను అనుమతిస్తున్నాయి. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ యాప్స్​లో 'ఫోన్​ పే' ఒకటిగా ఉంది. కూరగాయలు కొనడం నుంచి రైలు, విమాన టికెట్ బుకింగ్స్​ వరకు ఈ యాప్​నే చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. మొబైల్​ను హ్యాక్ చేసి ఫోన్ పే, బ్యాంకు అకౌంట్ నుంచి సైబర్ మోసగాళ్లు నగదును కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో బిహార్​లోని బాగల్​పుర్ చెందిన ఓ యువకుడు ఫోన్ పేలో ఓ బగ్​ను కనుగొన్నాడు. అదెంటంటే?

బాగల్​పుర్​లోని బుధానాథ్​కు చెందిన మయాంక్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు. ఓటీపీ లేకుండా ఫోన్ పేలో లాగిన్ అయ్యాడు. ఈ బగ్​ను ఫోన్ పేకి తెలియజేశాడు. దీనికి ప్రతిస్పందనగా ఆ సంస్థ మయాంక్​కు ఈ-మెయిల్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. మరికొద్ది రోజుల్లో మయాంక్​ను సన్మానించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా మయాంక్ పేరును హాల్ ఆఫ్ ఫేమ్​లో చేర్చింది.

"నేను ఫోన్ పే ద్వారా చాలా మందికి డబ్బులు పంపతున్నాను. ఈ క్రమంలో ఎవరైనా ఈ యాప్​ను హ్యాక్ చేయగలరా అనే సందేహం నాకు వచ్చింది. ఆ తర్వాత నేను ఫోన్ పే హ్యాకింగ్ చేసే అంశాలపై పరిశోధన ప్రారంభించాను. అప్పుడు నా ఫోన్​లో ఓటీపీ సెక్షన్​ను తొలగించాను. ఓటీపీ లేకపోయినా సులువుగా ఫోన్ పే లాగిన్ అయ్యాను. సాధారణంగా ఓటీపీతో ఫోన్ పే లాగిన్ అవ్వాలి. అది లేకపోయినా ఫోన్ పే లాగిన్ అయ్యాను. దీనిని బట్టి ఒకటి అర్థమవుతోంది. ఫోన్ పేను ఏ హ్యాకర్ అయినా హ్యాక్ చేయవచ్చు." అని ఈటీవీ భారత్​తో మయాంక్ తెలిపారు.

నాసా, గూగుల్​లో కూడా బగ్​
గతంలోనూ నాసా, గూగుల్​లో బగ్ గురించి ఆ సంస్థలకు వివరించాడు మయాంక్. 2023లో గూగుల్‌లో బగ్‌ను కనుగొని ఆ సంస్థకు తెలియజేశాడు. మయాంక్‌ను అభినందిస్తూ గూగుల్ అతడికి ఐఫోన్, ల్యాప్‌ టాప్, అనేక ఇతర వస్తువులను బహుమతిగా ఇచ్చింది. అలాగే నాసాలో పనిచేస్తున్న ఉద్యోగుల డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ సైట్‌ను పరిశీలించడం ద్వారా మయాంక్ కనుగొన్నాడు. ఈ విషయాన్ని నాసాకు తెలియజేశాడు. ప్రస్తుతం మయాంక్ కళింగ యూనివర్సిటీలో బీసీఏ చదువుతున్నారు. ఎథికల్ హ్యాకింగ్​లో మంచి పేరు సంపాదించుకున్నాడు. మయాంక్​పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ- తొలి వర్షానికే గర్భగుడిలోకి నీరు- విగ్రహం ఎదురుగానే! - Ayodhya Ram Mandir Leakage

ఎగ్జామ్ హాల్స్​లో ఇక AI సీసీ కెమెరాలతో నిఘా- నెట్​, నీట్ వివాదాలతో UPSC అలర్ట్ - AI BASED CCTV UPSC

ABOUT THE AUTHOR

...view details