తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​లో టెన్షన్ టెన్షన్! మరికొద్ది గంటల్లో బలపరీక్ష- ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీల తంటాలు! - bihar political crisis

Bihar Floor Test : బిహార్​లో ఎన్​డీఏతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ సోమవారం బల పరీక్షకు ఎదుర్కొనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడేందుకు పార్టీలు పావులు కదుపుతున్నాయి.

Bihar Floor Test
Bihar Floor Test

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 10:18 PM IST

Updated : Feb 11, 2024, 10:54 PM IST

Bihar Floor Test : ఎన్‌డీఏతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ బల పరీక్షలో నెగ్గి ఎన్​డీఏతో ప్రభుత్వాన్ని కొనసాగించాలని సీఎం నితీశ్​ కుమార్ పట్టుదలతో ఉన్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు బలం కలిగిన ఎన్​డీఏ బల పరీక్షలో గెలుపు ఖాయం ధీమాగా ఉన్నారు. మరోవైపు బల పరీక్షలో ఎలాగైన ఓడించాలని ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎన్డీయేతో పాటు మహా కూటమి పార్టీలు తంటాలు పడుతున్నాయి. అందులో భాగంగా తాజాగా జేడీయూ ఎమ్మెల్యేలను పట్నాలోని చాణక్య హోటల్​కు తరలించారు.

అంతకుముందు ఆదివారం సాయంత్రం జరిగిన మీటింగ్​కు పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో కొంతమందికి ఆర్జేడీ నుంచి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం.
బిహార్‌ అసెంబ్లీలో 243 మంది సభ్యులు ఉండగా 128 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్‌డీఏ సర్కారు విజయం తమదే అని విశ్వాసంతో ఉంది. ఈ క్రమంలో నితీశ్ కుమార్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఈ బల పరీక్షకు తప్పని సరిగా రావాలని విప్​ను జారీ చేశారు.

మరోవైపు నీతీశ్​ను ఓడించాలని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్​జేడీ పావులు కదుపుతోంది. ఈ మేరకు జేడీయూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆర్​జేడీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్​ నుంచి ఆదివారం పట్నా చేరుకున్న ఎమ్మెల్యేలను ఆర్​జేడీ నేత తేజశ్వి యాదవ్​ నివాసానికి తరలించారు. ఈ క్రమంలో తేజశ్వి యాదవ్​ నివాసం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్​గా ఉన్న ఆర్​జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ యాదవ్ అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. బలపరీక్షలో నెగ్గి ఎన్​డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటై అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ విషయంపై సోమవారమే అసెంబ్లీలో పోరాడేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉంది.

అయోధ్య రామయ్య దర్శనానికి యోగి టీమ్- ​దేవుడు, భక్తుల మధ్య దూరం లేదన్న ఎస్​పీ!

'లోక్​సభ ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 370 సీట్లు- కాంగ్రెస్​ తుడిచిపెట్టుకుపోవడం పక్కా!'

Last Updated : Feb 11, 2024, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details