PM Modi Inaugurates Z-Morh Tunnel : జమ్ముకశ్మీర్‌లో నిర్మించిన జెడ్ - మోడ్ సొరంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన సొరంగం లోపలకి వెళ్లి నిశితంగా పరిశీలించారు. టన్నెల్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న పలువురు కార్మికులతో మోదీ ముచ్చటించారు. ఈ ప్రాజెక్టుపై పనిచేసిన అధికారులతోనూ ప్రధాని సంభాషించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు.
#WATCH | Sonamarg, Jammu & Kashmir: After inaugurating the Z-Morh tunnel, Prime Minister Narendra Modi inspects the tunnel.
— ANI (@ANI) January 13, 2025
CM Omar Abdullah, LG Manoj Sinha and Union Minister Nitin Gadkari are also present.
(Source: DD/ANI) #KashmirOnTheRise pic.twitter.com/FbOP7COfzm
ఈ సొరంగం సోన్‌మార్గ్‌తో పాటు, కార్గిల్, లేహ్ ప్రజల జీవితాలను సులభతరం చేస్తుందని ప్రధాని అన్నారు. 'కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015లో సోన్‌మార్గ్ టన్నెల్ పనులు ప్రారంభమయ్యాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సొరంగం నిర్మాణం మా ప్రభుత్వ హయాంలోనే పూర్తైంది. నాకు ఎల్లప్పుడూ ఒక మంత్రం ఉంది. నేను ఏది శంకుస్థాపన చేసినా దాన్ని ప్రారంభిస్తాను. ఈ మొత్తం ప్రాంతంలో ఈ సొరంగం సోన్‌మార్గ్‌తో పాటు పర్యాటకానికి కొత్త రెక్కలు ఇస్తుంది. జమ్ముకశ్మీర్‌లో రానున్న రోజుల్లో రోడ్డు, రైలు కనెక్టివిటీకి సంబంధించిన చాలా ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఆస్పత్రులు, కళాశాలల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది కొత్త జమ్ముకశ్మీర్' అని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Sonamarg: On the inauguration of the Z-Morh tunnel, Prime Minister Narendra Modi says, " you can be sure, this is modi. if he makes a promise, he keeps it. there is a time for every work and the right work is going to be done at the right time. the sonamarg tunnel will… pic.twitter.com/rSbRz7oBYd
— ANI (@ANI) January 13, 2025
వ్యూహాత్మకంగా మన దేశానికి అత్యంత కీలకమైన ఈ టన్నెల్ నిర్మాణానికి ఏకంగా రూ.2,680 కోట్లు ఖర్చయ్యాయి. ఇంతగా నిధులు వెచ్చించి ఈ టన్నెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్మించింది? 'జెడ్ - మోడ్' నిర్మాణ వివరాలు ఏమిటి? దీనివల్ల భారత్‌కు సైనికంగా దక్కే ప్రయోజనం ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం.
చలికాలంలోనూ సోన్‌మార్గ్‌కు వెళ్లేందుకు రోడ్ క్లియర్
జెడ్- మోడ్ టన్నెల్ గురించి తెలుసుకునే ముందు మనం జోజిలా టన్నెల్ ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలి. ఆ ప్రాజెక్టు విస్తరణ ప్రక్రియలో భాగంగానే జెడ్-మోడ్ టన్నెల్‌ను కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. జమ్ముకశ్మీర్‌లోని బాల్తల్ గ్రామం నుంచి కార్గిల్ జిల్లాలోని డ్రాస్ పట్టణం వరకు 31 కి.మీ విస్తీర్ణంలో, 18 కి.మీ అప్రోచ్ రోడ్‌తో జోజిలా టన్నెల్ ప్రాజెక్టు ఉంటుంది. దీని పూర్తి పనులు 2030 సంవత్సరం నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక జెడ్- మోడ్ టన్నెల్ అనేది శ్రీనగర్‌ను లద్ధాఖ్‌ను అనుసంధానిస్తుంది. ఎంత మంచు కురిసినా సైన్యం, ప్రజలు రాకపోకలకు అంతరాయం కలగకుండా, ఆధునిక హంగులతో, సురక్షితంగా ఉండే రీతిలో ఈ టన్నెల్‌ను నిర్మించారు. అందుకే దీని నిర్మాణానికి రూ.2,680 కోట్లు ఖర్చు అయ్యింది.
I am eagerly awaiting my visit to Sonmarg, Jammu and Kashmir for the tunnel inauguration. You rightly point out the benefits for tourism and the local economy.
— Narendra Modi (@narendramodi) January 11, 2025
Also, loved the aerial pictures and videos! https://t.co/JCBT8Ei175
ఇకపై ఆ సమస్య ఉండదు
ఏటా చలికాలంలో కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం సోన్‌మార్గ్‌కు మంచుతో దారి మూసుకుపోతుంటుంది. ఇకపై ఆ సమస్య ఉండదు. ఎందుకంటే జెడ్- మోడ్ టన్నెల్ మీదుగా ప్రయాణించి శ్రీనగర్- లద్ధాఖ్ హైవేపై ఉన్న సోన్‌మార్గ్‌కు పర్యటకులు నేరుగా చేరుకోవచ్చు. అంటే పర్యటకంగానూ ఇది మన దేశానికి చాలా ఉపయోగపడుతుంది. గండేర్బల్ జిల్లాలోని కాంగన్ పట్టణానికి సైతం ఈ టన్నెల్ ప్రధాన మార్గంగా మారనుంది.
జెడ్- మోడ్ టన్నెల్ విశేషాలు
- జెడ్-మోడ్ సొరంగం నిర్మాణ పనులు పూర్తికావడానికి 12 ఏళ్ల సమయం పట్టింది.
- యాప్‌కో-శ్రీ అమర్‌నాథ్‌జీ టన్నెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దీన్ని నిర్మించింది.
- వాస్తవానికి 2023 ఆగస్టు నాటికే ఈ సొరంగం పనులు పూర్తి చేయాలనుకున్నారు. కానీ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది.
- 2024 ఫిబ్రవరిలోనే దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం దీన్ని అధికారికంగా ప్రధాని మోదీ ప్రారంభించారు.
- ఈ సొరంగంలోని ప్రధాన టన్నెల్ 6.4 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంటుంది. దీని వెడల్పు 10 మీటర్లు. టూ వే ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొనేలా దీన్ని డిజైన్ చేశారు.
- అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు జెడ్- మోడ్ సొరంగంలో ఒక ఎస్కేప్ టన్నెల్‌ను నిర్మించారు. అది 6.4 కి.మీ పొడవు, 7.5 మీటర్ల వెడల్పుతో ఉంది.
- జెడ్ - మోడ్ సొరంగంలో వాహనాలను గంటకు 80 కి.మీ వేగంతో నడపొచ్చు.
- ఈ సొరంగంలో నుంచి 1000 కార్లను ఒకేసారి తీసుకెళ్లొచ్చు.
- ఈ టన్నెల్ సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కారణంగా అందులో వెంటిలేషన్ ఉండేలా, గాలి సులభంగా ప్రవేశించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతి(NATM)లో ఈ సొరంగాన్ని నిర్మించారు.
- నిఘా అవసరాల కోసం ఈ సొరంగంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
సైనికంగా ఎందుకు ముఖ్యమైంది ?
జెడ్- మోడ్ సొరంగం మనదేశ సైన్యానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ టన్నెల్‌లో నుంచి చాలా తక్కువ సమయంలోనే సోన్‌మార్గ్, లద్ధాఖ్‌లకు భారత సైన్యం చేరుకోగలదు. ఇంతకుముందు హిమపాతం, మంచుచరియలు విరిగిపడటం వంటి వాటి వల్ల సోన్‌మార్గ్, లద్ధాఖ్‌కు సైన్యం చేరుకోవడంలో చాలా జాప్యం జరిగేది. ఇకపై అలాంటి సమస్యలు లేకుండా టన్నెల్‌లో నుంచి సాఫీగా సైనిక వాహనాలు రాకపోకలు సాగించగలవు. లద్ధాఖ్‌కు సమీపంలోనే పాక్ ఆక్రమిత కశ్మీరులోని ప్రాంతాలు, చైనా-భారత్‌లకు చెందిన వాస్తవ నియంత్రణ రేఖలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఏవైనా ఉద్రిక్తతలు జరిగినా భారత్ సైనికపరమైన కదలికలు సాఫీగా జరుగుతాయి.
Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurated the Z-Morh tunnel in Sonamarg.
— ANI (@ANI) January 13, 2025
(Source: DD/ANI) pic.twitter.com/NfAs22Aflk