తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాగి పాత్రలు సీల్ తీసిన వాటిలా మెరిసిపోవాలా? - ఇలా చేయండి! - Copper Utensils Cleaning Tips

Copper Utensils Cleaning Tips: ఈ రోజుల్లో ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలా మంది ఇళ్లలో రాగి పాత్రలను వాడుతున్నారు. అయితే ఇవి కూడా అన్ని పాత్రల మాదిరిగానే యూజ్ చేస్తుంటే నల్లగా మారిపోతుంటాయి. ఈక్రమంలోనే చాలా మంది వీటిపై ఏర్పడిన మరకలను తొలగించడానికి నానా తంటాలు పడుతుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ పాటించారంటే.. మీ రాగి పాత్రలు తళతళ మెరవడం పక్కా! అవేంటో ఇప్పుడు చూద్దాం..

Copper
Copper Utensils

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 5:19 PM IST

Best Cleaning Tips for Copper Utensils:ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ రోజుల్లో చాలామంది.. రాగి పాత్రలను యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా నీళ్లు తాగడానికి ఎక్కువ మంది కాపర్ వాటర్ బాటిల్స్(Copper Bottles), రాగి బిందెలు వాడుతున్నారు. అయితే.. వీటిని ఎలా క్లీన్ చేయాలో చాలా మందికి తెలియదు. దీంతో మచ్చలు ఏర్పడి, నల్లబడతాయి. మరి.. రాగిపాత్రలను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

నిమ్మ - ఉప్పు: ఇవి ఎవరి వంటగదిలోనైనా అందుబాటులో ఉండే పదార్థాలు. రాగి పాత్రల క్లీనింగ్ విషయంలో ఈ రెండూ చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి. వీటితో కాపర్ పాత్రలను తోమారంటే తళతళా మెరిసిపోవడం ఖాయం! ఎలా యూజ్ చేయాలంటే.. ముందుగా నిమ్మకాయను కోసి.. ఒక ముక్కను తీసుకొని దానిపై కొంచం ఉప్పు వేసుకుని రాగి పాత్ర అంతటా మెత్తగా రుద్దాలి. ఇవి గిన్నెలు, బిందెల అడుగు భాగం లేదా అంచుల వెంబడి పేరుకుపోయిన మొండి మరకలను ఈజీగా వదిలిస్తాయి. ఈ మిశ్రమాన్ని పాత్రలకు అప్లై చేశాక కనీసం 30 నిమిషాల పాటు అలాగే ఉంచి.. మధ్య మధ్యలో స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకున్నారంటే.. మీ పాత్రలు కొత్తవాటిలా మెరిసిపోతాయి.

వెనిగర్ - ఉప్పు: రాగి పాత్రలను శుభ్రం చేయడానికి వెనిగర్, ఉప్పు మిశ్రమం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మొదట వెనిగర్‌లో ఉప్పును కరిగించుకోవాలి. ఆ తర్వాత రాగి పాత్రకు ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఒక మెత్తని క్లాత్​తో మచ్చలు, నలుపు రంగు తొలగిపోయే వరకూ స్క్రబ్ చేయాలి. అనంతరం శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టాలి. అంతే.. మీ కాపర్ పాత్ర కొత్తరూపును సంతరించుకుంటుంది.

రాగి పాత్రలు వాడితే బరువు ఇట్టే తగ్గుతారట తెలుసా!

కెచప్ :మీ రాగి పాత్రలను తళతళ మెరిపించడంలో కెచప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఎందుకంటే కెచప్​లో ఉండే సహజ ఆమ్లత్వం రాగి పాత్రల మీద ఉన్న మరకలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీనిని ఎలా యూజ్ చేయాలంటే.. ముందుగా మీరు శుభ్రం చేయాలనుకుంటున్న పాత్రను నీటిలో తడిపి కొంత కెచప్ తీసుకొని దానికి అప్లై చేయాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత నైలాన్ ప్యాడ్ లేదా మృదువైన స్పాంజ్ తీసుకుని స్క్రబ్ చేయాలి. ఆపై శుభ్రమైన నీటితో క్లీన్ చేయాలి. ఆ తర్వాత ఆరబెట్టి, పాత్ర చుట్టూ ఆలివ్ ఆయిల్ రుద్దండి. ఇలా చేస్తే కొత్తదానిలా రాగి పాత్ర మెరిసిపోతుంది.

బేకింగ్ సోడా: రాగి పాత్రను శుభ్రం చేయడానికి ఇది అత్యంత ఎఫెక్టివ్ మార్గం. బేకింగ్ సోడా ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది. రాగిపాత్రలను దీనితో శుభ్రం చేశారంటే కొత్తవాటిలా కనిపిస్తాయి. ముందుగా కొంచెం బేకింగ్ సోడా తీసుకొని రాగి పాత్ర అంతటా అప్లై చేసి మరకలు ఉన్న చోట్ స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి మృదువైన గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. అవసరమైతే మీరు నిమ్మకాయతో బేకింగ్ సోడా యూజ్ చేసి పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు.

రాగి పాత్రలు ఆరోగ్యాన్ని పెంచుతాయా?

ABOUT THE AUTHOR

...view details