తెలంగాణ

telangana

ETV Bharat / bharat

165 కి.మీ ఈదిన 14మంది ఆటిజం బాధిత పిల్లలు- వైకల్యాన్ని అధిగమించి ప్రపంచ రికార్డ్​! - స్విమ్వింగ్​లో చిన్నారుల ప్రతిభ

Autistic Children Create Record : సాధించాలనే పట్టుదల, కృషి ఉంటే ఏదైనా చేయవచ్చని నిరూపించారు ఆ చిన్నారులు. ఆటిజంతో బాధపడుతున్నప్పటికీ వైకల్యాన్ని అధిగమించి సముద్రంలో రిలే పద్ధతిలో 165 కిలోమీటర్లు ఈత కొట్టారు చైన్నైకి చెందిన 14 మంది చిన్నారులు. వారి కథ ఏంటో ఓ సారి చూద్దామా.

Autistic Children Create Record
Autistic Children Create Record

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 5:21 PM IST

Updated : Feb 18, 2024, 5:40 PM IST

Autistic Children Create Record :సముద్రంలో 165 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు 14మంది చిన్నారులు. ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? వారంతా ఆటిజం అనే మానసిక సమస్యతో బాధపడుతున్నవారు. వీరంతా తమిళనాడులోని కడలూరు నుంచి చెన్నై మధ్య రిలే పద్ధతిలో ఈతకొట్టి రికార్డును సొంతం చేసుకున్నారు.

సాధారణంగా ఆటిజం ఉన్న వారిలో మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండదు. అలాంటి వారిలో ఉన్న ప్రతిభా సామర్థ్యాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేసేందుకు కొన్ని సంస్థలు కృషిచేస్తున్నాయి. ఆ కోవకే చెందిందీ యాదవీ స్పోర్ట్స్​ ఇన్​స్టిట్యూట్​. ఈ సంస్థ ఆటిజంతో బాధపడుతున్న 9 నుంచి 19 ఏళ్ల వయసున్న 14 మంది పిల్లలకు ఈతలో శిక్షణను ఇచ్చింది. ఆ పిల్లల ప్రతిభా సామర్థ్యాలను వెలికి తీసి ప్రపంచానికి చాటిచెప్పాలని సంకల్పించింది. ఇందుకోసం తమిళనాడు స్పోర్ట్స్​ డెవలప్​మెంట్ అథారిటీ వారి సహాయాన్ని కోరింది.

పలు రికార్డులు సొంతం చేసుకున్న చిన్నారులు
ఈ సాహసయాత్ర ఫిబ్రవరి 1న కడలూరు సిల్వర్​ బీచ్​ వద్ద ప్రారంభమైంది. 5 జిల్లాలను కలుపుతూ శిక్షకుల పర్యవేక్షణలో 14 మంది చిన్నారులు రిలే పద్దతిలో ఈదుతూ 165 కిలోమీటర్ల దూరాన్ని 4 రోజుల్లో పూర్తి చేశారు . వారి ప్రతిభకు ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​, ఏషియన్ బుక్​ ఆఫ్ రికార్డ్స్​, వరల్డ్​ రికార్డులు దాసోహం అయ్యాయి. 'బాలలు సాధించిన ఈ విజయం గురించి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రికార్డు నెలకొల్పిన చిన్నారులంతా అటిజంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ వారి శారీరక అవరోధాలను అధిగమించి ఈ విజయాన్ని సాధించారు. ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాలు ఉంటాయని నిరూపించారు' అని యాధవీ స్పొర్ట్స్​ అకాడమీ వ్యవస్థాపకులు సతీశ్ శివకుమార్ తెలిపారు.

'వైకల్యాన్ని అధిగమించారు'
రికార్డులు సాధించిన చిన్నారుల్లో ముగ్గురు నిరంతరాయంగా 17 కిలోమీటర్లు ఈదారు. మరో బాలిక కూడా ఏకధాటిగా 10 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసింది. 'తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి వైకల్యం అడ్డురాదని పిల్లలు నిరూపించారని తమిళనాడు మాజీ డీజీపీ శైలేంద్రబాబు తెలిపారు. ఈ ఘనత సాధించిన చిన్నారులను ఆయన సత్కరించారు.

14 ఏళ్లకే 100 ప్రపంచ రికార్డులు- తొమ్మిదేళ్లకే డాక్టరేట్- కళ్లకు గంతలతో సైకిల్‌ రైడింగ్​

గాలిపటం దారంపై జాతీయ గేయం- 20 నిమిషాల్లోనే రాసి రికార్డు- 3మి.మీ పుస్తకంలో హనుమాన్ చాలీసా!

Last Updated : Feb 18, 2024, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details