Akhilesh Yadav Offer To BJP MLAs :ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంలో అంతర్యుద్ధం కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అధికార పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలకు మాన్‌సూన్ పేరుతో బంఫర్ ఆఫర్ ఇచ్చారు. యూపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ నుంచి బయటకు రావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పరోక్షంగా కోరారు. వంద మంది ఎమ్మెల్యేలను తెచ్చుకొని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు.
ఆయనను ఉద్దేశించే పోస్ట్!
అయితే అఖిలేశ్ తన పోస్టులో ఏ బీజేపీ నాయకుడి పేరు ప్రస్తావించలేదు. కానీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో విభేదిస్తున్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉద్దేశించి అఖిలేశ్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2022లో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ 111 స్థానాలు గెలిచింది. బీజేపీలోని వంద మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే తాము సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలమని అఖిలేశ్ పేర్కొన్నారు.