ETV Bharat / state

గేమ్‌ఛేంజర్ సినిమాపై హైకోర్టులో పిటిషన్ - HIGH COURT HEARING ON SPECIAL SHOWS

ఉదయం 4.30గం.కు ప్రదర్శనకు అనుమతివ్వడపై పిటిషనర్ అభ్యంతరం - టికెట్ ధరల పెంపు కూడా నిబంధనలకు విరుద్ధమన్న పిటిషనర్ - విచారణ రేపటికి వాయిదా

GAME CHANGER
HIGH COURT ON GAME CHANGER MOVIE SHOWS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 10 hours ago

Updated : 8 hours ago

High Court hearing on Game Changer movie special shows : గేమ్‌ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్‌ షోలపై తెలంగాణ హై కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గొర్ల భరత్‌ రాజ్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేయగా జస్టిస్ బి.విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ చేపట్టారు. జనవరి 10వ తేదిన ఉదయం 4.30 గంటలకు సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ధరలు పెంచకుండా ఆదేశించండి : టికెట్ ధరల పెంపు కూడా నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. గేమ్​ ఛేంజర్​ సినిమా టికెట్‌ పెంపుపై ఉత్తర్వులివ్వకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టు స్పందిస్తూ తరచూ ఇలాంటి మెమోలు ఎందుకిస్తున్నారని ప్రశ్నించింది. తదుపరి విచారణను రేపటికి (జనవరి 10) వాయిదా వేసింది.

బెనిఫిట్​ షోలకు నిరాకరణ : దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అర్థరాత్రి 1 గంట బెనిఫిట్ షోలకు మాత్రం ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. జనవరి 10న వేకువజామున 4 గంటల నుంచి 6 షోలకు అనుమతించింది.

రోజూ 5 షోలు : జనవరి 10న మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్​పై అదనంగా రూ. 150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్​పై అదనంగా రూ. 100 చొప్పున పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. జనవరి 11 నుంచి రోజూ 5 షోల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 11 నుంచి 19 వరకూ మల్టీప్లెక్సులలో టికెట్​పై అదనంగా రూ. 100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ అదనంగా రూ. 50 రూపాయల చొప్పున ధరలు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు(వెంకటేశ్వర రెడ్డి)కు అనుమతి ఇచ్చింది.

ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు- ఇట్స్ రామ్​చరణ్ టైమ్- రెండోసారైనా?

మరో సినిమాకు ప్రభాస్ ఓకే- అనౌన్స్​మెంట్ ఎప్పుడంటే!

Last Updated : 8 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.