ETV Bharat / state

'మార్చి నెలాఖరులోగా ఎల్​ఆర్​ఎస్​ సమస్యలు పరిష్కరించాలి!' - GOVT ON LRS ISSUES

మున్సిపల్ కమిషనర్లకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కీలక ఆదేశాలు - ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆదేశం - స్వయం సహాయ సంఘాల సౌర విద్యుత్ ప్లాంట్లకు త్వరలో టెండర్లు పిలుస్తామని వెల్లడి

LRS ISSUES IN TELANGANA
LAY OUT REGULARIZATION SCHEME (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 9 hours ago

Lay out Regularization Scheme Update : ఎల్​ఆర్​ఎస్​ (లేఅవుట్​ రెగ్యులరైజేషన్​ స్కీం) దరఖాస్తుల పరిష్కారంపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా ఎల్​ఆర్​ఎస్​ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలోని 142 పురపాలక సంఘాల కమిషనర్‌లతో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో దాన కిషోర్ సమావేశమయ్యారు.

ఎల్​ఆర్​ఎస్​, రెవెన్యూ, రెవెన్యూయేతర పన్ను వసూళ్ల లక్ష్యం, ఇప్పటి వరకు సాధించిన పన్నులు, మహిళా స్వయం సహాయక సంఘాల అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తప్పిదాలకు తావు లేకుండా ఎల్​ఆర్​ఎస్​ ప్రక్రియను మార్చి నెెలలోగా పూర్తిచేయాలన్నారు. దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతులు తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అర్హులైన ప్రతి మహిళను స్వయం సహాయక సంఘంలో చేర్పించాలని ప్రభుత్వం ఏజెండాగా పెట్టుకుందన్న విషయాన్ని గుర్తుచేశారు.

5 వేల కోట్లకు పెంచిన ప్రభుత్వం : మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్లను బ్యాంక్ లింకేజి కింద ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇప్పటి వరకు రూ. 2500 కోట్లను సంఘాలకు అందించామని తెలిపారు. దీని ఫలితంగా ప్రభుత్వం బ్యాంక్ లింకేజ్ లక్ష్యాన్ని రూ. 5వేల కోట్లకు పెంచిందన్నారు. మిగతా రూ. 2500 కోట్లను సంఘాలకు అందించేందుకు మున్సిపల్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేసే సౌర విద్యుత్తు ప్లాంట్ల టెండర్లను త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనున్నట్లు తెలిపారు. దాన కిషోర్ మెప్మా స్వయం సహాయక సంఘాల ద్వారా పట్టణాల పరిధిలోని ఖాళీ స్థలాలు, రిజర్వాయర్లు, వాటర్ ట్యాంక్​లపై సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

అత్యధిక ఆదాయం అర్బన్​ నుంచే : రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా పట్టణ జనాభా ఉందన్న దాన కిషోర్ త్వరలో దేశంలోనే అత్యధిక అర్బన్ ఏరియా ఉన్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుందన్నారు. రాష్ట్ర జీఎస్​డీపీకి 70 శాతం ఆదాయం అర్బన్ ఏరియా నుంచే వస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం వచ్చే 6 నెలల్లో 48 మంది మున్సిపల్ కమిషనర్​, 300 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించనుందని వెల్లడించారు. ఆస్తి పన్ను, ట్రెడ్ లైసెన్సు, నీటి పన్ను వసూళ్లు ఆశించిన మేర రావడం లేదన్న దాన కిషోర్ క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారంతో పాటు ఎల్​ఆర్ఎస్​, రెవెన్యూ మేళాలు, ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహిస్తూ మార్చి నెలాఖరులోగా వందశాతం లక్ష్యాలను సాధించాలన్నారు.

LRSపై మంత్రి కీలక వ్యాఖ్యలు - కలెక్టర్లకు ఆదేశాలు - ఏం జరగనుంది? - LRS Application Process Slows Down

నాడు ఎల్‌ఆర్‌ఎస్ ఉచితమని చెప్పి - నేడు ఫీజు వసూలు చేయడం దుర్మార్గం : హరీశ్​రావు - Harish Rao Letter To CM Revanth

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.