ETV Bharat / bharat

హానీ రోజ్ కేసులో కేరళ బిజినెస్​మ్యాన్ అరెస్ట్! ఆమె ఫుల్ హ్యాపీ అంట!! - HONEY ROSE SEXUAL HARASSMENT CASE

నటి హనీరోజ్‌పై వేధింపులకు పాల్పడిన కేరళ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Honey Rose Sexual Harassment Case
Honey Rose, Boby Chemmanur (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 19 hours ago

Honey Rose Sexual Harassment Case : మలయాళ సినీ నటి హనీ రోజ్‌పై వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అదుపులోకి తీసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని నటి హనీ రోజ్‌ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వయనాడ్‌లో బాబీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పుడు తనకెంతో ప్రశాంతంగా ఉందంటూ బాబీని అరెస్ట్​పై హానీ రోజ్​ స్పందించారు. ఈ కేసు విషయం గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మాటిచ్చారని తెలిపారు

కొంతకాలంగా సోషల్‌ మీడియాలో తనపై ఓ వ్యాపారవేత్త అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని హనీరోజ్‌ ఆరోపించారు. వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్లు పెడుతున్నారని ఆరోపిస్తూ ఎర్నాకుళం పోలీస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 30మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాజీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా మంగళవారం మరోసారి తనను వేధించిన వ్యక్తి వివరాలు బయటపెడుతూ హనీరోజ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వివరాలు మేరకు ప్రసుత్తం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌, వ్యాపారవేత్త బాబీని అదుపులోకి తీసుకుంది. నిందితుడు గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని, కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయినట్లు హనీ రోజ్‌ చెప్పారు. అందుకు ప్రతీకారంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తంచేశారు.

'హనీ రోజ్​కు న్యాయ సాయం చేస్తాం'
మరోవైపు నటి హనీ రోజ్‌కు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ సంఘం(అమ్మ) మద్దతు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ఆమెపై అభ్యంతరకంగా పెడుతున్న పోస్టులపై చట్టపరంగా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని మంగళవారం ఓ లేఖ విడుదల చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కామెంట్స్‌ను తీవ్రంగా ఖండించిన మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ సంఘం అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.