Fire Accident At Kumbhmela :ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు సమీపంలోని పలు గుడారాలకు వ్యాపించాయి. ఘటనా స్థలంలో భారీగా పొగలు అలుముకున్నాయి. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రయాగ్‌రాజ్ డీఎం రవీంద్రకుమార్ చెప్పిన వివరాల ప్రకారం, 'సెక్టార్ 19లో గీతా ప్రెస్ టెంట్‌లోని ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు మంటలు చెలరేగాయి. సమీపంలోని 18 టెంట్లకు మంటలు వ్యాపించాయి. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పరిస్థితి అదుపులో ఉంది.