103 Year Old Man Married Third Time :మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ 103 ఏళ్ల వృద్ధుడు 49 ఏళ్ల మహిళను మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఇద్దరు భార్యలు మరణించడం వల్ల ఒంటరిగా ఉండలేక మూడోసారి వివాహం చేసుకున్నట్లు స్థానికులతో ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన తన భార్యతో ఆటోలో వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది
భోపాల్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు హబీబ్ నాజర్‌కు ఇది వరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ తన ఇద్దరు భార్యలు మరణించారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న ఆయన, ఈ వయసులో ఒంటరిగా ఉండాలనుకోలేదు. అందుకే మూడో వివాహం చేసుకోవాలనుకున్నారు. అలా 49 ఏళ్ల కుల్జమా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. స్థానికంగా మంచి పేరు ఉన్న హబీబ్ తన మూడో భార్యతో ఇటీవలే ఆటోలో బయటకెళ్లారు. ఆ సమయంలో అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆటోలో మూడో భార్యతో 103ఏళ్ల వృద్ధుడు కొన్నినెలల క్రితం, ఒడిశాలో 76 ఏళ్ల వృద్ధుడికి లేటు వయసులో ప్రేమ చిగురించింది. ఎనిమిదేళ్ల పాటు ప్రేమిస్తున్న 46 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. గంజాం జిల్లాలోని సంఖెముండి మండలం అడ్డాడ గ్రామంలో రామచంద్ర సాహు అనే 76 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. అతడికి చాలా ఏళ్ల క్రితం పెళ్లైంది. తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహం చేశాడు. ఒక కుమార్తె అత్తవారంట్లో ఉండగా మరో కుమార్తె చనిపోయింది. అంతకుముందే తన భార్య చనిపోయింది. దాదాపు 18 ఏళ్ల నుంచి ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు రామచంద్ర. దీంతో అతడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్ ప్రాంతంలోని కులగర్ గ్రామానికి చెందిన త్రినాథ్ సాహు కుమార్తె సురేఖ (46)ను చూశాడు. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రామచంద్ర వివాహ ప్రతిపాదనకు సురేఖ కూడా అంగీకరించింది. దీంతో ఇద్దరూ కొన్నాళ్ల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. చివరకు జులైన 19న భంజ్‌నగర్ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గుడిలో ఆచారాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు.