'కథకళి'తో అదరగొట్టిన కలెక్టర్.. అరంగేట్రంలోనే.. - కేరళ సాంస్కృతిక ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
ఓ వైపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూనే నాట్యంలో తన ప్రతిభను కనబరుస్తున్నారు కేరళలోని వయనాడ్ కలెక్టర్ ఏ గీత. వయనాడ్లో శనివారం నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో కథకళి నాట్యంలో అరంగేట్రం చేశారు. తన పాఠశాల స్థాయి నుంచే చాలా వేదికల మీద నృత్య ప్రదర్శనలు చేసినా.. కథకళిలో ప్రదర్శన చేయాలని కోరిక ఉండేది. శనివారంతో ఆ కోరిక తీరిపోయినట్లు తెలిపారు కలెక్టర్. గత సెప్టెంబర్లో జిల్లా కలెక్టర్గా వచ్చిన గీత.. ఓ వివాహ వేడుకలో నృత్య ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST