విద్యుత్​ టవర్​ ఎక్కి యువకుడు హల్​చల్​- తాగిన మైకంలో.. - అమృత్​సర్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 23, 2022, 2:59 PM IST

పంజాబ్​, అమృత్‌సర్‌లోని హకిమా వాలాలో 100 అడుగుల ఎత్తైన విద్యుత్తు టవర్‌ ఎక్కి ఓ యువకుడు హల్​చల్​ చేశాడు. మాదకద్రవ్యాలకు బానిసై.. మతిస్తిమితం కోల్పోయిన ఆ యువకుడు విద్యుత్‌ టవర్‌ చివరిఅంచులకు ఎక్కి అధికారులను హడలెత్తించాడు. యువకుడిని కిందకి దించేందుకు స్థానికులు చేసిన యత్నాలు ఫలించకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. యువకుడు మద్యం మత్తులోనే టవర్​ ఎక్కినట్లు పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.