భర్తకు గుండెపోటు.. నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణం పోసిన భార్య! - madhura railway station
🎬 Watch Now: Feature Video
గుండెపోటు వచ్చిన తన భర్తకు నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణాలు కాపాడింది ఓ మహిళ. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వేస్టేషన్‌లో జరిగింది. కోజీకోడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు రావడం వల్ల అక్కడికక్కడే కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అతడిని రైలులో నుంచి కిందకి దించి ప్లాట్‌ఫామ్‌పై సీపీఆర్ చేశారు. అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురువతూనే భర్త ప్రాణాలకు అండగా నిలిచింది. తన నోటి ద్వారా భర్తకు పది నిమిషాలు శ్వాసను అందించింది. ఆమెకు రైల్వే పోలీసులూ తోడయ్యారు. కాళ్లు, చేతులు నలుస్తూ సపర్యలు చేశారు. ఆ వ్యక్తికి స్పృహ రాగానే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.