Viral Video: బరాత్‌లో పాముతో నాగిని డాన్స్.. చివరకు.. - నాగిని డాన్స్
🎬 Watch Now: Feature Video
Nagin Dance With Snake: పెళ్లి ఊరేగింపులో విషపూరిత పాముతో నాగిని డాన్స్ చేయించాడు ఓ మాంత్రికుడు. నాగస్వరం ఊదుతూ సర్పాన్ని లొంగదీసుకున్నాడు. బుట్టలో ఉన్న దాన్ని చేతితో పట్టుకుని ఆడించాడు. ఈ డాన్స్ చూస్తూ బరాత్‌లో పాల్గొన్న వారంతా ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పామును ఆడించిన వ్యక్తితో పాటు అందుకు కారణమైన మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఇలాంటి నిషిద్ధ చర్యలకు పాల్పడవద్దని స్థానికులను హెచ్చరించారు. ఒడిశా మయూర్భంజ్ జిల్లా కరంజియాలో ఈ ఘటన జరిగింది.