ఇద్దరు పిల్లల్ని రైలులో నుంచి తోసేసి, దూకిన మహిళ.. లక్కీగా... - Ujjain railway station woman jump with two children
🎬 Watch Now: Feature Video
హడావుడిలో ఓ మహిళ.. తనతోపాటు ఇద్దరు పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలో పడేసింది. అదృష్టంకొద్దీ పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో ముప్పు నుంచి తప్పించుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని రైల్వే స్టేషన్లో శనివారం జరిగిందీ ఘటన. జయపుర్-నాగ్‌పుర్ రైలు కదులుతుండగానే.. ఓ మహిళ తన ఇద్దరు పిల్లల్ని ప్లాట్‌ఫాంపైకి తోసేసింది. వెంటనే ఆమె కూడా దూకింది. పిల్లలు రైలుకు కాస్త దూరంగా పడినా.. ఆమె మాత్రం నియంత్రణ కోల్పోయింది. దాదాపుగా రైలు కిందకు వెళ్లిపోయినంత పనైంది. క్షణాల వ్యవధిలోనే ఈ ముగ్గురినీ కాపాడారు ఓ పోలీస్ కానిస్టేబుల్. తాము ఎక్కిన రైలు సీహోర్‌లో ఆగదని తెలిసి ఆమె ఇలా చేసిందని అధికారులు చెప్పారు.