వరదలో కొట్టుకుపోయిన లారీ- అనేక టన్నుల రేషన్ బియ్యం నీటిపాలు - flood videos 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2022, 3:57 PM IST

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ జిల్లాలో ఓ లారీ వరదలో కొట్టుకుపోగా.. అనేక టన్నుల రేషన్​ బియ్యం నీటిపాలైంది. భోపాలపట్టణంలోని మెట్టుపల్లి వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. అనేక చోట్ల రహదారులు నీటమునిగాయి. అయితే.. రేషన్​ బియ్యంతో వస్తున్న ఓ లారీ డ్రైవర్.. వరద పరిస్థితిని సరిగా అంచనా వేయకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. నీటి ఉద్ధృతికి ఆ లారీ కొట్టుకుపోయింది. డ్రైవర్ మాత్రం చాకచక్యంగా బయటపడ్డాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.