స్కూటీని డ్రైవర్‌తో సహా అంతెత్తున గాల్లోకి లేపిన క్రేన్.. కారణం తెలిస్తే..! - ట్రాఫిక్ పోలీసులు వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15902484-thumbnail-3x2-crane-bike.jpg)
వాహనదారుడు స్కూటీపై ఉండగానే క్రేన్ సాయంతో వాహనాన్ని గాల్లోకి లేపారు ట్రాఫిక్ పోలీసులు. నో పార్కింగ్ జోన్లో స్కూటీ పార్క్ చేయడమే అందుకు కారణం. మొదట ట్రాఫిక్ పోలీసులు క్రేన్‌తో ఆ వాహనాన్ని ఎత్తుకెళ్లేందుకు వచ్చారు. కానీ ఆ సమయంలో యజమాని అడ్డు తగిలి స్కూటీపైనే కూర్చున్నాడు. దీంతో అతను కూర్చొని ఉండగానే క్రేన్‌తో వాహనాన్ని గాల్లోకి లేపారు ట్రాఫిక్ పోలీసులు. అక్కడే ఉన్న పలువురు స్థానికులు ఈ దృశ్యాలసు మొబైళ్లలో బంధించారు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని అంజుమాన్ కాంప్లెక్స్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై ట్రాఫిక్ డిపార్ట్మెంట్ విచారణకు ఆదేశించింది.
Last Updated : Jul 23, 2022, 2:24 PM IST