గన్తో బెదిరించి చోరీకి యత్నం.. దుండగులతో షాప్ ఓనర్ ఫైట్.. వీడియో వైరల్ - ఎలక్ట్రానిక్ షాపులో దోపిడీ
🎬 Watch Now: Feature Video
గుజరాత్ మోడాసా జిల్లా కేంద్రంలోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో దోపిడీకి యత్నించారు ముగ్గురు దుండగులు. మల్పుర్ రోడ్డులోని షాపులోకి వచ్చిన దుండగులు.. నగదు ఇవ్వాలంటూ యజమానిని తుపాకీతో బెదిరించారు. అతడు నగదు ఇవ్వడానికి నిరాకరించడం వల్ల అతడిపై దాడి చేశారు. అనంతరం బైక్పై అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలే షాపులోకి వచ్చి దోపిడీకి యత్నించడం వల్ల యజమానులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
Last Updated : Jul 19, 2022, 11:11 AM IST