స్నానానికి నదిలో దిగి కొట్టుకుపోయిన వ్యక్తి.. యువకుల సాహసంతో లక్కీగా.. - హరిద్వార్ ్వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 27, 2022, 12:04 PM IST

స్నానం చేసేందుకు నదిలో దిగి కొట్టుకుపోయిన ఓ వ్యక్తిని స్థానిక యువకులు కాపాడిన సంఘటన ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో జరిగింది. ఆదివారం స్థానికంగా ఉన్న గంగానహర్​లో స్నానానికి దిగాడు ఓ వ్యక్తి. కాసేపటికే నీటి ప్రవాహం ఎక్కువవ్వడం వల్ల కొట్టుకుపోయాడు. అది గమనించిన ముగ్గురు యువకులు వెంటనే నీటిలో దూకారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ముగ్గురు యువకులను గ్రామస్థులు, పోలీసులు ప్రశంసలతో ముంచెత్తారు. అందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.