సీఎంతో మీటింగ్‌కు వచ్చి ప్లేట్ల కోసం ఫైట్- చిక్కుల్లో ప్రధానోపాధ్యాయులు - teachers fight for plates
🎬 Watch Now: Feature Video
విద్యా ప్రమాణాలు పెంచడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నిర్వహించిన ఓ సమావేశం.. రెండు జిల్లాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చిక్కులు తెచ్చిపెట్టింది. సీఎంతో భేటీ తర్వాత భోజనం ప్లేట్ల కోసం వారంతా గొడవ పడడమే ఇందుకు కారణం. ఈనెల 10న చండీగఢ్‌లో జరిగిన ఈ 'ఘర్షణ' వీడియో వైరల్ కాగా.. విద్యా శాఖ తీవ్రంగా పరిగణించింది. వీడియోలో గొడవ పడుతూ కనిపించిన ప్రధానోపాధ్యాయులకు సమన్లు జారీ చేసింది. ఈనెల 20న సంబంధిత జిల్లా విద్యా శాఖ ప్రధాన కార్యాలయాలకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.