'నిర్మాతల మధ్య ఐక్యత లేక.. సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం!' - తమిళ్​ రాకర్స్​ హీరో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2022, 7:42 AM IST

Actor Arun Vijay Special Interview: 'బ్రూస్‌ లీ', 'సాహో' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు అరుణ్​ విజయ్. ఆయన హీరోగా.. సినిమా పైరసీ నేపథ్యంలో తాజాగా తెరకెక్కిన వెబ్​ సిరీస్​ 'తమిళ్​ రాకర్స్'. ఆగస్టు 19 నుంచి ఓటీటీ 'సోనీ లివ్'​లో ఈ వెబ్​సిరీస్​ స్ట్రీమింగ్​ కానున్న సందర్భంగా అరుణ్ విజయ్ 'ఈటీవీ-భారత్​'తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అయితే ​నిర్మాతల మధ్య ఐక్యత లేకపోవడం కారణంగా తమిళ సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వారం వరుసగా ఐదారు సినిమాలు విడుదల చేయడం వల్ల నిర్మాతలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదన్నారు. ఈ విషయంలో టాలీవుడ్‌ నిర్మాతలంతా ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు శాపంగా మారిన పైరసీని ఎలా కట్టడి చేయొచ్చో తమ సిరీస్‌లో చూపించామని తెలిపిన విజయ్.. తన సోదరిమణులతో రాఖీ పండుగ ఎలా జరుపుకొంటారో వివరించారు. అరుణ్‌ పంచుకున్న మరిన్ని విశేషాలు ఈ వీడియోలో చూడండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.