వినూత్నంగా నాగపంచమి వేడుకలు.. వందల పాములను మెడకు చుట్టుకొని.. - అగాపుర్లో పాముల పండగ
🎬 Watch Now: Feature Video
బిహార్లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ మండలం ఆగాపుర్ గ్రామస్థులు మాత్రం ఇందుకు భిన్నం. వేడుకల్లో భాగంగా.. భగత్ అని పిలిచే కొందరు పూజారులు గ్రామంలోని ఓ నీటి కుంట నుంచి వందల పాములను బయటకు తీస్తారు. మంత్రాలు ఉచ్ఛరిస్తూ పాములను తీసి.. వాటితో విన్యాసాలు చేస్తారు. మెడకు చుట్టుకొని ఆడిస్తారు. ఇవేవీ సాధారణ సర్పాలా అంటే కాదు. చాలా వరకు విషపూరితమైనవే. అయినా బెదరకుండా భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొంటారు. మరోవైపు, సమస్తీపుర్ జిల్లాలోని విభూతిపుర్లో పదుల సంఖ్యలో పాములను ఊరేగించారు. పెద్ద సంఖ్యలో యువకులు.. సర్పాలను తమ చేతుల్లో పట్టుకొని రోడ్లపై తిరిగారు.