వేగంగా వచ్చి బోల్తా పడిన 'లోడ్' లారీ.. వీడియో వైరల్ - ట్రక్కు బోల్తా
🎬 Watch Now: Feature Video
Road Accident News: లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ కోయిలండి రహదారి వద్ద మలుపు తిరిగే సమయంలో ఒక్కసారిగా బోల్తా పడింది. ఎదురుగా ఎటువంటి వాహనం రాకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రెవర్, క్లీనర్ చిన్న చిన్న గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అశాస్త్రీయంగా నిర్మించిన రోడ్డు కారణంగా ఇక్కడ తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.