బస్సులో 15 అడుగుల పైథాన్ కలకలం.. లగేజీ బాక్స్‌లోకి వెళ్లి.. - బస్సులో పైథాన్
🎬 Watch Now: Feature Video
Python In Bus: ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని ఓ బస్సులో పైథాన్ కలకలం సృష్టించింది. సివిల్ లైన్స్ బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సు లగేజీ బాక్స్‌లోకి పైథాన్ చొరబడింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు తీవ్రంగా శ్రమించి పామును పట్టుకున్నారు. లగేజీ బాక్స్‌లోకి భారీ కొండచిలువ చొరబడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్థానికులు.
Last Updated : Sep 21, 2022, 8:24 PM IST