పతనం దిశగా మహా వికాస్ అగాడీ ప్రభుత్వం.. ఈ దుస్థితికి అసలు కారణాలేంటి? - మహారాష్ట్రలో ఉంత్కఠంగా రాజకీయ సమీకరణాలు
🎬 Watch Now: Feature Video

మహారాష్ట్రలో మహా వికాస్ అగాడీ ప్రభుత్వం పతనం దిశగా అడుగులేస్తోంది. శివసేన మంత్రి ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందనీ, తమదే అసలైన శివసేన అంటూ గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో శిందే కోరితే మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు భాజపా వైపు నుంచి సంకేతాలొచ్చాయి. ఇప్పటికే సూరత్, అస్సోం శిబిరాల నుంచి జరుగుతున్న క్యాంపు రాజకీయాలతో క్షణక్షణానికి పరిస్థితులు మారిపోతున్నాయి. అసలు మహారాష్ట్ర ప్రభుత్వంలో ముసలం పుట్టడానికి కారణాలేంటి? ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చేయడంలో భాజపా నిర్వహిస్తున్న పాత్ర ఏంటి? మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత దేశంలో కూలిపోయిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని..