ప్రతిధ్వని: చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ఎలా ఎదుగుతోంది..? - investments in india news
🎬 Watch Now: Feature Video

భారత్‌లో పెట్టుబడులు పెట్టవల్సిందిగా అంతర్జాతీయ పెట్టుబడిదారులను ప్రధాని మోదీ కోరారు. దీర్ఘ కాలంలో మంచి లాభాలు అర్జించేందుకు భారత్ అత్యుత్తమైన దేశమని ప్రధాని అభివర్ణించారు. ప్రపంచ వృద్ధి చోదకంగా భారత్‌ను మలిచేందుకు ప్రభుత్వపరంగా ఏం చేయాలో అన్ని చేస్తున్నామని ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ తయారీ దిగ్గజంగా మన దేశం ఎదిగేందుకు ఆత్మ నిర్భర భారత్ తీసుకొచ్చామని వివరించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు.. భారత్ ఎంతో అనుకూలమైన దేశం, చైనాకు ప్రత్యామ్నాయంగా మన దేశం ఏ విధంగా ఎదుగుతుందనే అంశాలపై ప్రతిధ్వని చర్చ.