ఆయిల్ ట్యాంకర్లో పేలుడు.. నలుగురు సజీవదహనం - Oil Tanker Exploded news
🎬 Watch Now: Feature Video
Oil Tanker Exploded: వంతెనపై ప్రయాణిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. దీంతో వెంటనే ట్యాంకర్.. వంతెనపై నుంచి కింద పడింది. ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో బడాపాండుసర్ వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.
Last Updated : Jun 12, 2022, 10:00 AM IST